హుజూర్‌నగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ మునిగిపోతున్న నాన అని.. ఆ పార్టీకి ప్రజలు ఎందుకు ఓటేస్తారని ప్రశ్నించారు.

హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ గెలిచినా ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు కేటీఆర్. తెలుగుదేశం, బీజేపీలకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉండదని హుజూర్‌నగర్ అభివృద్ధిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పేవన్నీ ఆబద్ధాలేనని ఆయన దుయ్యబట్టారు.

నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ఉత్తమ్ ప్రభుత్వానికి ఎలాంటి లేఖ ఇవ్వలేదని కేటీఆర్ వెల్లడించారు. విపక్షాల అనైక్యతను ప్రజలు గమనిస్తున్నారని మంత్రి తెలిపారు.

మరోవైపు హుజూర్‌నగర్‌లో ఏ పార్టీకి మద్ధతు తెలపాలన్న దానిపై హైదరాబాద్‌లోని ముఖ్దూం భవనంలో సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం సమావేశమైంది.

ఉపఎన్నికల్లో ఎవరికి మద్థతు ఇవ్వాలనే దానిపై నిర్ణయాన్ని స్థానిక నాయకత్వానికే వదిలిపెట్టాలని రాష్ట్ర అధినాయత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే మద్ధతు విషయంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే.