తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల విషయంలో అమిత్ షా అబద్ధాలు చెబుతున్నారంటూ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తాను చెప్పింది తప్పయితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఆయన సవాల్ విసిరారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు (amit shah) సవాల్ విసిరారు టీఆర్ఎస్ (trs) వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ (ktr) . తెలంగాణకు రూ.2.52 లక్షల కోట్లు ఇచ్చామని అమిత్ షా అబద్ధాలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణాయే కేంద్రానికి రూ.3.65 లక్షల కోట్లు ఇచ్చిందన్నారు. తాను చెప్పింది తప్పయితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని.. బీజేపీ చెప్పింది తప్పయితే అమిత్ షా ముక్కు నేలకు రాస్తారా అని కేటీఆర్ సవాల్ విసిరారు.
కాగా.. ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) గుండెల్లో తెలంగాణ ఎప్పుడూ ఉందని, ఏ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. న్యూఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని (telangana formation day) పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చరిత్ర పోరాటాలతో నిండి ఉందన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం యువత ఎన్నో ఏళ్లుగా పోరాడి త్యాగాలు చేసిందన్నారు.
ALso Read:తెలంగాణకు ప్రధాని రూ. 2,52,202 కోట్లు ఇచ్చారు.. సవతి తల్లి ప్రేమ చూపలేదు - అమిత్ షా
చివరికి ఎన్నో పోరాటాల తరువాత 2014 జూన్ 2వ తేదీన భారతదేశంలోని అతి చిన్న వయస్సులో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఉనికిలోకి వచ్చింది అని ఆయన పేర్కొన్నారు. అయితే తెలంగాణ ఏర్పాటు చేదుకు దారితీసే విధంగా జరిగిందని మంత్రి చెప్పారు. గత ఎనిమిదేళ్లలో తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం రూ.2,52,202 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. ‘‘ మేము వివిధ పద్దుల కింద డబ్బు పంపాము. తెలంగాణ ఎప్పుడూ ప్రధాని నరేంద్ర మోడీ గుండెల్లోనే ఉంది. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్రం నుంచి మాకు పెద్దగా మద్దతు లభించలేదు ’’ అని అన్నారు.
సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ లేకుంటే తెలంగాణ, దాని పొరుగు ప్రాంతాలు నిజాంల నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందలేకపోయేవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ పాలన పోయి తమ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవం, హైదరాబాద్ విమోచన దినోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. “ సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఆ పోలీసు చర్య తీసుకోకపోతే, బహుశా భారతదేశం వేరే మ్యాప్‌ని కలిగి ఉండేది. నిజాంల నిరంకుశ పాలన నుంచి విముక్తి కల్పించిన సర్దార్ పటేల్‌కు దేశం మొత్తం రుణపడి ఉంటుంది. ఇప్పటికి కూడా తెలంగాణ విమోచన దినోత్సవం లేదా హైదరాబాద్ విమోచన దినోత్సవం జరుపుకోవడం లేదని చెప్పడానికి ఎంతో బాధగా ఉంది. ఏది ఏమైనప్పటికీ పాలన మారబోతోంది.. తప్పకుండా జరుపుకుంటాం. ’’ అని అన్నారు.
