టీఆర్ఎస్ లో చేరడానికి కాంగ్రెస్ నాయకులంతా రెడీ, ఆ ఇద్దరు మినహా: కేటీఆర్

Minister KTR Attack On  telangana congress
Highlights

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి నాయకుడు టికెట్లు ఇస్తామని హామీ ఇస్తే టీఆర్ఎస్ లో చేరడానికి సిద్దంగా ఉన్నారని ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్ అన్నారు. టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానా రెడ్డి మినహా మిగతావారంతా అధికార పార్టీలో చేరడానికి ఉవ్విళ్లూరుతున్నారని తెలిపారు. తాము తలచుకుంటే కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయొచ్చు కానీ అలా చేయాలని అనుకోవడం లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ లో చేరతామంటున్నా తామే వందంటున్నామని కేటీఆర్ తెలిపారు. 

టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పై మంత్రి మరోసారి నిప్పులుచేరిగారు. గడ్డం పెంచుకున్న ప్రతివాడు గబ్బర్ సింగ్ కారని అన్నారు.ఇకనైనా గడ్డం తీయకుంటే సన్నాసుల్లో కలవాల్సి వస్తుందంటూ విరుచుకుపడ్డారు. ఉత్తమ్ దగ్గర మాట్లాడేందుకు సబ్జెక్ట్ ఉండదని, ఆయన మాట్లాడేదంతా సొల్లెనని అన్నారు. తెలంగాణ ప్రజలకు కూడా ఆ విషయం తెలుసని కేటీఆర్ అన్నారు.

తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీకి 70 సీట్లు వస్తాయని ఉత్తమ్ ధీరాలు పలుకుతున్నాడు. కానీ కేవలం తెలంగాణలో కాదు, దేశం మొత్తం మీద వారికి అన్ని సీట్లు రావంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. అయినా కాంగ్రెస్ పార్టీకి ఏ రాష్ట్రంలో అయినా సొంతంగా 20 సీట్లు గెలిచే పరిస్థితి ఉందా? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. తన సొంత నియోజకవర్గం అమేథీ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ను గెలిపించుకోలేని రాహుల్ గాంధీ... తెలంగాణలో పొడిచేది ఏముంటుందంటూ మంత్రి విమర్శల వర్షం కురిపించారు. 

వచ్చే ఎన్నికల్లో ఏదో నిశ్శబ్ద విప్లవం వస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ నిశ్శబ్ద విప్లవం కాదు...శబ్ద విప్లవమే వస్తుందన్నారు. ఈ శబ్దానికి కాంగ్రెస్ పార్టీకి, నాయకులకు గూబ గుయ్యిమనడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి అదిష్టానం డిల్లీలో ఉంటే, టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం తెలంగాణ గల్లీల్లో ఉందంటూ కేటీఆర్ చమత్కరించారు. 
 
loader