నిర్మలాసీతారామన్ ప్రవర్తన దిగ్భ్రాంతి కలిగించింది... కేటీఆర్ ట్వీట్...
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కలెక్టర్ తో ప్రవర్తించిన తీరు తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలంగాణ మినిస్టర్ కేటీఆర్ ట్వీట్ చేశారు.
హైదరాబాద్ : శుక్రవారం చౌక ధరల దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్న బియ్యంలో కేంద్రం, రాష్ట్ర వాటా ఎంత అన్నదానికి సమాధానం చెప్పలేదని జిల్లా కలెక్టర్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మందలించిన విషయం తెలిసిందే. దీనిమీద తెలంగాణ మంత్రి కెటి రామారావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిమీద కేటీఆర్ మాట్లాడుతూ, ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తుల ఇలాంటి ప్రవర్తనే "కష్టపడి పనిచేసే ఐఎఎస్ ఆఫీసర్లను నిరుత్సాహపరుస్తుంది" అని అన్నారు.
ఈ మేరకు కేటీఆర్ శుక్రవారం రాత్రి ఒక ట్వీట్ చేశారు.. "కామారెడ్డి జిల్లా మేజిస్ట్రేట్/కలెక్టర్‌తో ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ప్రవర్తించిన తీరుకు నేను భయపడ్డాను" అని అన్నారు. "ఈ రాజకీయ చరిత్రకారులు వీధుల్లో కష్టపడి పనిచేసే AIS అధికారులను మాత్రమే నిరుత్సాహపరుస్తారు" అన్నారాయన. ఆ సమయంలో "కలెక్టర్_కెఎంఆర్ జితేష్ వి పాటిల్, ఐఏఎస్ హుందాగా వ్యవహరించిన తీరుకు నా అభినందనలు" అని ఆయన ట్వీట్ చేశారు.
కలెక్టర్‌ను నిలదీసిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్.. మోడీ ఫొటో ఏదంటూ ఫైర్
బీర్కూర్‌లోని పీడీఎస్ రేషన్ దుకాణాన్ని తనిఖీ చేసిన సందర్భంగా, కేంద్ర మంత్రి కలెక్టర్ జితేష్ పాటిల్‌ను అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ ఫొటో ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. ఆ తరువాత 2020 మార్చి-ఏప్రిల్ నుండి, రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకుండానే కేంద్రం లబ్ధిదారులు రూ.30లకే.. రూ 35 ల బియ్యాన్ని ఉచితంగా అందజేస్తోందని సీతారామన్ చెప్పారు. బీజేపీ 'లోక్‌సభ ప్రవాస్ యోజన'లో భాగంగా జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలకు హాజరైన సీతారామన్ ప్రస్తుతం రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.