తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఊహించని పరిణామం ఎదురైంది. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీకి ఎదురే లేదన్న వాతావరణం ఉన్న ఈ సమయంలో మంత్రి జూపల్లి సొంత నియోజకవర్గంలో జరిగిన సర్పంచ్ ఎన్నికలో టిఆర్ఎస్ ఓటమిపాలైంది.

కొల్లాపూర్ నియోజకవర్గంలోని వీపంగండ్ల మండల కేంద్రంలో జరిగిన సర్పంచ్ ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి పై కాంగ్రెస్ అభ్యర్థి బీరయ్య 116 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మంత్రి జూపల్లి సొంత నియోజకవర్గంలో ఈ ఓటమి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

అంతేకాకుండా మంత్రి జూపల్లి ఈ మండల కేంద్రాన్ని దత్తత తీసుకున్నారు. దత్తత గ్రామంలోనే టిఆర్ఎస్ ఓటమిపాలవడం అధికార పార్టీ నేతలను కలవరపాటుకు గురిచేస్తోంది