Asianet News TeluguAsianet News Telugu

నాకు ఈటల గతి పట్టదు: కేబినెట్ నుండి తొలగిస్తారనే ప్రచారంపై జగదీష్ రెడ్డి

తనకు కూడా ఈటల రాజేందర్ గతి పడుతుందనేది కలలో కూడ జరగదని తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి ధీమాను వ్యక్తం చేశారు.

minister Jagadish Reddy reacts on speculations on removal from cabinet lns
Author
Hyderabad, First Published Jun 14, 2021, 4:53 PM IST


హైదరాబాద్:తనకు కూడా ఈటల రాజేందర్ గతి పడుతుందనేది కలలో కూడ జరగదని తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి ధీమాను వ్యక్తం చేశారు.సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరికపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు  ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. 

also read:మునిగిపోయే నావలో చేరారు: బీజేపీలో ఈటల చేరికపై మంత్రి జగదీష్ రెడ్డి

హంపి కథంతా కొందరి స్క్రిప్ట్ అని ఆయన చెప్పారు. తనకు కూడా ఈటల గతతి పడుతుందని కొందరు కలలుకంటున్నారన్నారు. కానీ, కలలో కూడా అది జరగదని ఆయన  ధీమాను వ్యక్తం చేశారు. తనను కేబినెట్ నుండి తొలగించాలని ఇతర పార్టీల నేతలు కలలు కంటున్నారన్నారు. ఈటల రాజేందర్ ను కూడా ఇలానే చేశారని ఆయన  చెప్పారు. తనను కేబినెట్ నుండి బయటకు పంపాలనే కోరిక తమ పార్టీలో ఎవరికీ కూడ లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈటల రాజేందర్ తర్వాత జగదీష్ రెడ్డిని కేబినెట్ నుండి తప్పిస్తారనే రీతిలో ఓ ఆంగ్ల పత్రిక కథనం రాసింది.

 కర్ణాటక రాష్ట్రంలోని హంపిలో జరిగిన కార్యక్రమంలో కొందరు పార్టీ ఎమ్మెల్యేలతో జరిగిన ప్రైవేట్ కార్యక్రమంలో మంత్రి సంభాషణను ఆ పత్రిక ప్రచురించింది.  ఈ కథనాన్ని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.  దీంతో ఈ విషయం మరింత ప్రాచుర్యం పొందింది. ఈటల రాజేందర్ ఎపిసోడ్ సమయంలోనే ఈ పత్రికలో ఈ కథనం రావడం టీఆర్ఎస్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. . అయితే ఈ విషయమై మంత్రి జగదీష్ రెడ్డి ఇావాళ స్పందించారు. 
 


 

Follow Us:
Download App:
  • android
  • ios