ప్రత్యేక ఎజెండాతోనే ఈటల రాజేందర్ బీజేపీలో చేరారని తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. 

హైదరాబాద్:ప్రత్యేక ఎజెండాతోనే ఈటల రాజేందర్ బీజేపీలో చేరారని తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. సోమవారం నాడు ఆయన హైద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ను విమర్శించే హక్కు ఈటల రాజేందర్ కు లేదన్నారు. ఈటల రాజేందర్ మునిగిపోయే పడవ ఎక్కుతున్నారన్నారు. బీజేపీతో పాటు ఈటల రాజేందర్ కూడ మునిగిపోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ నుండి పోయినవాళ్లే నష్టపోతారు.. పార్టీకి ఏం నష్టం లేదని జగదీష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 

also read:కేసీఆర్‌ది రాచరికపు ఫ్యూడల్ మనస్తత్వం: ఈటల

బీసీలకు బీజేపీ ఏం చేసిందని ఈటల రాజేందర్ పలుమార్లు ప్రశ్నించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నియోజకవర్గప్రజలను ఈటల మోసం చేశారని ఆయన చెప్పారు. రాజకీయాల్లో విభేదాలు రావడం సహజమన్నారు. ఈటల మాటలకు చేతలకు పొంతన ఉండదని మంత్రి చెప్పారు. పార్టీ అనేక అవకాశాలు ఇచ్చినా వినియోగించుకోకుండా బీజేపీలో చేరాడన్నారు. దేశంలో ప్రజలంతా బీజేపీని వ్యతిరేకిఃస్తున్నారని ఆయన చెప్పారు. 2014కు ముందు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉండేది, ప్రస్తుతం ఎలా ఉందనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసునన్నారు.