Asianet News Telugu

వాటర్ వార్ : జగన్ తండ్రిని మించిన దుర్మార్గుడు.. మళ్లోసారి ఫైర్ అయిన జగదీష్ రెడ్డి..

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధానికి లేఖ రాయడం పై మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. జగన్ తండ్రిని మించిన దుర్మార్గుడని మరోసారి విరుచుకుపడ్డారు. 

minister jagadish reddy fires on ys jagan over letter to pm on srisailam Thermal power - bsb
Author
Hyderabad, First Published Jul 2, 2021, 2:01 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధానికి లేఖ రాయడం పై మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. జగన్ తండ్రిని మించిన దుర్మార్గుడని మరోసారి విరుచుకుపడ్డారు. 

సమస్యను సృష్టించిందే ఆంధ్రాసర్కార్ అని అన్నారు. వారికి హైదరాబాద్ నీటి అవసరాలు పట్టవా? కోర్టుకిచ్చిన మాటను తప్పిందేవరు? సర్వేల పేరిట నిర్మాణాలు కొనసాగిస్తోంది నిజం కాదా? అని ఘాటుగా ప్రశ్నించారు. 

జీవోల పేరిట చిలకపలుకులు పలకుతున్నారని,  కానీ తెలంగాణ అవసరాల కోసం ఒక్క జీవో ను ఇచ్చారా? అని ప్రశ్నించారు. మద్రాస్ కు మంచినీటి పేరుతో వైఎస్ రాజశేఖరరెడ్డి కృష్ణా నీళ్లను దోచుకున్నారు. సాగర్ ఎడమ కాలువ కింద రైతాంగానికి 50 ఏండ్లు ద్రోహమే చేశారు.

ఏడేండ్ల కరువులోను కృష్ణాడెల్టా కు నీళ్లు వదిలారు. ఎడమ కాలువ ఎత్తు మీద కుడికాలువ కింది భాగంలో  ఉంది. హుకుంలు జారీ చేయడం,దౌర్జన్యం, బెదిరింపులతో శ్రీశైలం, సాగర్ గేట్లు తెరిపించారు. ఆడుకుంటాం, వాడుకుంటాం అంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. 

జల వివాదం : ఏపీకి తెలంగాణ కౌంటర్, కేఆర్ఎంబీ తీరుపై కూడ అసంతృప్తి

ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నంత కాలం తెలంగాణా హక్కుల్ని ఎవరూ హరించ లేరని చెప్పుకొచ్చారు. చట్టపరంగానే విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని, శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టిందే జలవిద్యుత్ ఉత్పత్తి కోసమని అన్నారు. 

రైతులు ఎక్కడైనా రైతులే అని, ఇరు రాష్ట్రాలకు పనికి వచ్చే ఫార్ములాను ముందుకు తెచ్చిందే ముఖ్యమంత్రి కేసీఆర్ అని గుర్తు చేశారు. ఫార్ములాను పక్కన పెట్టి అహంకారంతో పోతున్నారన్నారు. ఇందులో తెలంగాణాది  వీసమెత్తు తప్పు కూడా లేదన్నారు. తప్పు చేశినోళ్లే లేఖల పేరుతో పరిహాసం ఆడుతున్నారన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios