Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ కు చిల్లర గాళ్ళు కాదు.. ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి.. జగదీశ్ రెడ్డి (వీడియో)

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బాషా గురించి చెప్తే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి బాధ్యతాయుతంగా మాట్లాడలేదు. రాష్ట్రం నుండి ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా బాధ్యతాయుతంగా మాట్లాడలేదన్నారు.

minister jagadish reddy fires on bandi sanjay comments
Author
Hyderabad, First Published Nov 30, 2021, 3:00 PM IST

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మీడియాతో విద్యుత్ శాఖ మంత్రి Jagadish Reddy మాట్లాడారు. రాష్ట్ర రైతాంగం పట్ల కేంద్ర BJP government అదే మోసాగించే ప్రయత్నం చేస్తోందని.. అది తప్ప రాష్ట్రానికి మేలు చేసింది ఏం లేదని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. 

"

వాళ్ళ ప్రెస్ మీట్ లో చెప్పిందే చెప్పారు తప్ప కొత్తగా ఏం చెప్పలేదన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బాషా గురించి చెప్తే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుందని ఎద్దేవా చేశారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి బాధ్యతాయుతంగా మాట్లాడలేదు. రాష్ట్రం నుండి ఉన్న కేంద్ర మంత్రి Kishan Reddy కూడా బాధ్యతాయుతంగా మాట్లాడలేదన్నారు.

దేశంలో ఎక్కడా లేని పథకాలు సీఎం KCR ఇక్కడ ప్రవేశపెట్టారు. అలా చేయాలంటే మాటలు కాదు చేతలు కావాలి అన్నారు. అంతేకాదు Language గురించి ఇతనే మాట్లాడాలి.. ఇతను మాట్లాడిన మాటలు ఎవరికి తెలీదూ అంటూ ఎద్దేవా చేశారు. 

వడ్లు ఎన్ని కొంటారో ఇప్పటివరకు చెప్పడం లేదని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఎన్ని కొంటారో చెప్పకుండా ఏవేవో మాట్లాడుతున్నాడన్నారు.  కేంద్ర ప్రభుత్వ ఎంపీలుగా కాదు.. వరి ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రయోజనాలకోసం కేంద్ర ప్రభుత్వ మంత్రులు మాట్లాడాలి అన్నారు.

ఎందుకు ఇక్కడే Rice grain పెరిగింది ఎందుకు మీ గుజరాత్ లో పెరుగలేదు. అన్ని రాష్ట్రాల్లో లేని ఇబ్బంది ఇక్కడే ఎందుకు అని మాట్లాడుతున్నారు. అన్ని రాష్ట్రాల్లో కంటే ఇక్కడే అధికంగా ధాన్యం పండుతుంది అనడానికి ఇది నిదర్శనం కాదా? అని ప్రశ్నించారు. 

2014 తరువాత తెలంగాణా ఎలా ఉండేది... ఇప్పుడు ఎలా ఉందో చూస్తే తెలుస్తోందన్నారు. తెలంగాణ వచ్చాక నీళ్లు వచ్చాయి. పంటలు పండుతున్నాయి. కానీ, ఇవాళ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలు పండించిన పంటలు ఎందుకు కొనడం లేదో చెప్పాలి.

Telangana Airports: తెలంగాణలో ఆరు కొత్త ఎయిర్‌పోర్టుల స్టేటస్‌ ఇదే.. పార్లమెంట్‌లో వెల్లడించిన కేంద్రం..

Bandy Sanjay మాట్లాడిన మాటలు ఇవాళ మీ కేంద్ర మంత్రి పార్లమెంట్ లో మాట్లాడుతాడా? మేము ఎన్ని రోజులైనా మాట్లాడడానికి చర్చకు సిద్దంగా ఉన్నాం. దమ్ముంటే పార్లమెంట్ లో చర్చ పెట్టండి మా సభ్యులు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు.

ధాన్యం ఎందుకు కొనరో చెప్పడం లేదు. 2014ముందు కేసీఆర్ లేడు.. తెలంగాణ రాష్ట్రం లేదు.. 2014 తరువాత కేసీఆర్ వచ్చాడు.. తెలంగాణ వచ్చింది.. కాబట్టే ఇవాళ  ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకు మీ దగ్గర రైతు బంధు లేదు? ఎక్కడ మీరు పాలించే రాష్ట్రంలో ఎందుకు 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదు?

తెలంగాణ రాష్ట్రం లో ఇచినట్టే అన్ని రాష్ట్రాల్లో మీరు ఎందుకు అమలు చేయడం లేదు? మీకు ఆహార భద్రత పై అవగాహన లేదు. మీ చేతుల్లో ఉండేవి మీరు చేయకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. చిల్లర మాటలు మాట్లాడేది మీరు.

మా ముఖ్యమంత్రి లో తెలంగాణ ప్రజల ఆవేశం కనిపించింది. మా తెలంగాణ ప్రజల వడ్లు ఎన్ని కొంటారో చెప్పడం లేదు. దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పించే బాధ్యత మిది.అదికాకుండా అడ్డదిడ్డంగా ఏదేదో మాట్లాడుతున్నారు. సంవత్సరం ప్రణాళిక ఇవ్వమని మన సీఎం కేసీఆర్ అడిగారు అందులో తప్పు ఏముందో చెప్పండి.

అన్ని ప్రభుత్వాలకు పంచవర్ష ప్రణాళికలు, వార్షిక ప్రణాళికలు ఉంటాయి. మరి కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ప్రణాళికలు లేవు. కేంద్ర ప్రభుత్వంలోని ఎంపీలు కాదా చిల్లర మాటలు మాట్లాడడం మీ మంత్రులు సమాధానం చెప్పాలి ఈ చిల్లర గాళ్ళు కాదు.

చిల్లర గాళ్ళు కాదు రాష్ట్ర రైతాంగానికి, సీఎం కేసీఆర్కు సమాధానం చెప్పాల్సింది కేంద్ర మంత్రులు, ప్రధాని నరేంద్ర మోదీ చెప్పాలి. రాష్ట్ర రైతాంగం కు ఎం చెప్తారో చెప్పాల్సింది ప్రధాని నరేంద్ర మోడీ. విద్యుత్ చట్టం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేది మీరు కాదా. వ్యవసాయ బోర్లు, బావులకు మోటర్లకు మీటర్లు పెట్టాలని చెప్పేది మీరు కాదా. మీ విద్యుత్ చట్టం తో ఎవరికి లాభమో చెప్పాలి. ఎవరికి ఒరుగుతుందో చెప్పాలి. విద్యుత్ చట్టాలపై కూడా అన్ని బయట పెడుతాం అని మండిపడ్డారు.

Follow Us:
Download App:
  • android
  • ios