తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై తెలంగాణ ఇందన శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. సూర్యాపేటలో జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

బొడ్డుపల్లి శ్రీనివాస్ తన సొంత తమ్ముడి లెక్క అని కల్లబొల్లి మాటలు చెప్పిన కోమటిరెడ్డి ఇప్పుడు మరోలా మాట్లాడుతున్నారని విమర్శించారు. వ

చ్చే ఎన్నికల్లో శ్రీనివాస్ భార్య బొడ్డుపల్లి లక్ష్మికి నల్లగొండ అసెంబ్లీ టికెట్ ఇప్పిస్తానని ముందుగా చెప్పి ఇప్పుడు మాట మార్చాడని ఆరోపించారు.

పూటకో మాట మాట్లాడుతున్న కోమటిరెడ్డి ప్రజలందరినీ మోసం చేస్తున్నాడని మండిపడ్డారు.

వచ్చే ఎన్నికల్లో ప్రజలే కోమటిరెడ్డికి బుద్ది చెబుతారన్నారు.

నల్లగొండ జిల్లాలో కాంగ్రేస్ నేతలు శవరాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

వచ్చే ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ నేతలకు డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు.