మంత్రి జగదీష్ రెడ్డికి  ముఖ్యమంత్రి  కెసిఆర్  నిర్వహించిన సర్వేలో కేవలం 30 శాతం మార్కులే వచ్చాయనే వార్త గుప్పుమంది.ముఖ్యమంత్రికి బాగా నచ్చినోడు కావడంతో  ఈ విషయం ప్రకటించకుండా దాచే ప్రయ్నతం జరిగిందని చెబుతున్నారు.

తెలంగాణా క్యాబినెట్ మంత్రి జగదీష్ రెడ్డికి ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్వహించిన సర్వేలో కేవలం 30 శాతం మార్కులే వచ్చాయనే వార్త గుప్పుమంది. క్యాబినెట్ క్లాస్ రూమే అయిఉంటే, ఆయన ఫెయిలయినట్లే లెక్క.

ముఖ్యమంత్రికి బాగా నచ్చినోడు కావడంతో ఈ విషయం ప్రకటించకుండా దాచే ప్రయ్నతం జరిగిందని మీడియా కథనం.

ముఖ్యమంత్రి నిర్వహించిన మూడో సర్వేలో జగదీష రెడ్డి స్థానం పాతాంలో ఉంది.వచ్చింది 30మార్కులే. శనివారం నిర్వహించిన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో జిల్లాల వారిగా ఎమ్మెల్యేల ఫలితాలు ప్రకటించారు.మంత్రి జగదీష్ రెడ్డికి వచ్చిన మార్కులను చెప్పాల్సి వచ్చినపుడు దాటవేసే ప్రయత్నం జరిగింది.దీంతో ఆయనకు ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకోవాలనే ఉబలాటం ఎమ్మెల్యేలలో ఎక్కువయింది.

మొత్తానికి సర్వేఫలితాలు పట్టారు. తీరా చూస్తే మంత్రి పుంగవుడికి వచ్చింది కేవలం 30 మార్కులేనట. ఇది ఇబ్బందికరమయిన విషయం కావడంతో కెసిఆర్ జగదీష్ రెడ్డి పేరుని దాటవేసి తక్కువ మార్కులు వచ్చినఎమ్మెల్యేల పేర్ల నే ప్రకటించారు. వారు తీగలకృష్ణారెడ్డి, బాబుమోహన్, మాధవరం వగైరాలు. తక్కువ మార్కులొచ్చాయని మా పేర్లు రచ్చ చేసి ముద్దబ్బాయని జగదీష్ రెడ్డి పేరు పైకి చెప్పకపోవడమేమిటనివారుంటున్నారట.

సర్వేలో జగదీష్ రెడ్డి ఫెయిల్ మార్కులు రావడానికి కారణం ఏముంటుంది?

దీనిమీద మీడియా కథనాలు దారుణంగా ఉంటున్నాయి. మంత్రి కావడం, దానికి తోడు ముఖ్యమంత్రి మెచ్చినోడు కావడంతో పెద్ద, చిన్నా తేడా లేకుండా ఆయన నోరు పారుసుకుంటారని అంటున్నారు. ఇతర సభ్యుల మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటారని ఆరోపణలున్నాయి ముఖ్యమంత్రికి దగ్గరివాడు కావడంతో ఎవరూ ఆయన మీద తిరగబడటం లేదు.

తక్కువ మార్కులొచ్చిన ఎమ్మెల్యేలతో పాటు, టిఆర్ ఎస్ వర్గాలలో కూడా జగదీష్ రెడ్డి పనితీరు, ఆయన ధీమా, కెసిఆర్ అభిమానం చర్చనీయాంశమయ్యాయి.