బీజేపీ నేతలపై మండిపడ్డారు తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం మరోసారి విద్యుత్ సంస్కరణలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు.
ఇటీవల జాతీయ కార్యవర్గ సమావేశాలు (bjp national executive meeting) , పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభతో తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. అప్పటి నుంచి పార్టీ వర్గాలు స్పీడ్ పెంచాయి. లోక్ సభ స్థానాలను నాలుగు క్లస్టర్లుగా విభజించి.. వాటికి కేంద్ర మంత్రులను బాధ్యులుగా నియమించింది. అటు (trs) టీఆర్ఎస్- బీజేపీ నేతల మధ్య సైతం మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా బీజేపీ (bjp) నేతలపై మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు.
కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలపై గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల్లో వ్యతిరేకతను బీజేపీ (jagadish reddy) గుర్తించిందన్నారు. ఇప్పటికే విద్యుత్ సంస్కరణలను వ్యతిరేకిస్తూ కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారని చెప్పారు. సాగుచట్టాలను మళ్లీ అమలు చేస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారని.. విద్యుత్ సంస్కరణల (electricity reforms in india) విషయంలోనూ ఇలాగే చేసేందుకు యత్నిస్తున్నారని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. ఈ రెండు అమలు చేయడం భారతదేశ ప్రజలకు గొడ్డలి పెట్టని ఆయన అన్నారు.
ఇకపోతే.. వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు సహా విద్యుత్ సంస్కరణలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే దీనికి రాష్ట్రాల అనుమతి తప్పనిసరి. దీనికి అనుగుణంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు వెంటనే ఆమోదించినా.. తెలంగాణ, తమిళనాడు, బెంగాల్ సీఎంలు కేంద్రం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
