నాగార్జున సాగర్ ఎడమ కాలువకు రాష్ట్ర విద్యుత్ శాక మంత్రి జగదీష్ రెడ్డి నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా ఉమ్మడి నల్లగొండ  జిల్లాలతోపాటు ఖమ్మం జిల్లాకు చెందిన 6లక్షల ఎకరాలకు సాగునీరందుతుందని తెలిపారు. 

నల్లగొండ: నాగార్జున సాగర్ ఎడమ కాలువకు రాష్ట్ర విద్యుత్ శాక మంత్రి జగదీష్ రెడ్డి నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లాలతోపాటు ఖమ్మం జిల్లాకు చెందిన 6లక్షల ఎకరాలకు సాగునీరందుతుందని తెలిపారు. ఆయకట్టు చివరి ఎకరాకు నీరందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రతీ నీటిబొట్టును సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. 

నాగార్జునసాగర్‌ ఎడమ కాలువకు 2018 ఖరీఫ్‌ పంటల సాగుకు గాను విడతల వారీగా నీటిని విడుదల చేయ్యాలని ఇరిగేషన్ శాఖ అధికారారుల ప్లాన్. ఖరీఫ్‌లో నీటి లభ్యత ఆధారంగా ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతిలో ఎడ మ కాలువకు 40 టీఎంసీల నీటిని కేటాయించారు. ఖరీఫ్‌లో ఎడమ కాలువకు సాగు అవసరాలకు గాను 40 టీఎంసీలు కేటాయించారు. 

ఆరు విడతలుగా నీటిని 69 రోజుల పాటు విడుదల చేయనున్నట్లు ఇరిగేషన్ శాఖ అధికారులు స్పష్టం చేశారు. అయితే తొలివిడత నీటి విడుదలను మంత్రి జగదీష్ రెడ్డి విడుదల చేశారు. ఉమ్మడిన ల్లగొండ, ఖమ్మం సర్కిల్‌ పరిధిలో మొత్తం 6.25 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా...నల్లగొండ జిల్లాలో 1,45,720 ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 2,29,961 ఎకరాల ఆయకట్టు ఉంది. చివరి ఆయకట్టు వరకు నీరందించాలన్న లక్ష్యంతో అధికార యంత్రాంగం పనిచేస్తున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. 

"