తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ రాజ్ భవన్ లో రాజకీయాలను చొప్పించారని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. ప్రధానితో భేటీ తర్వాత తమిళిసై సౌందర రాజన్ చేసిన వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. 


సూర్యాపేట: రాజ్‌భవన్ లో రాజకీయాలను గవర్నర్ Tamilisai Soundararajan చొప్పించారని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రధాని Narendra Modi తో భేటీ తర్వాత న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. Governorను , రాజ్ భవన్ ను అవమానించారని వ్యాఖ్యానించారు. బహిరంగ చర్చకు కూడా తాను సిద్దమేనని కూడా సఃవాల్ చేశారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి Jagadeesh Reddyస్పందించారు.గవర్నర్ వ్యవస్థ గురించి KCR కు తెలియనంతగా మరెవరికి తెలియదన్నారు.

గవర్నర్ ఎవరి ఆదేశాల మేరకు ఇలా చేస్తున్నారో కూడా తెలియదన్నారు.రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఫైళ్లను గవర్నర్ ఉద్దేశ్య పూర్వకంగా వెనక్కి పంపుతున్నారని ఆయన ఆరోపించారు.గవర్నర్ మొదటి నుండి ఫైళ్లు ఆలస్యం చేస్తున్నారన్నారు.. తొలుత ఆమెకు సమయం తక్కువగా ఉందని భావించామన్నారు. కానీ ఉద్దేశ్యపూర్వకంగానే ఈ ఫైళ్లను గవర్నర్ ఆపారని అర్ధం అవుతుందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వంగా తాము ఎప్పుడూ కూడా గవర్నర్ పై మాట్లాడలేదన్నారు. ప్రోటోకాల్ అంశంపై గవర్నర్ కార్యాలయం నుండి తమ సర్కార్ కు ఎలాంటి ఫిర్యాదు అందలేదని జగదీశ్ రెడ్డి గుర్తు చేశారు. ముఖ్యమంత్రితో చర్చలు అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. 

ఏదైనా సమస్య ఉంటే గవర్నర్ సమయం తీసుకొని వెళ్తారు కదా అని మంత్రి జగదీష్ రెడ్డి అడిగారు. గవర్నర్ గా తనకున్న బాధ్యతలను, అధికారాలను గవర్నర్ నిర్వర్థించాల్సిందేనన్నారు. దీన్ని ఎవరూ ఆపలేరని చెప్పారు. ఏమైనా సమస్యలుంటే సీఎం కేసీఆర్ కలిసిన సమయంలోనే చెబితే బాగుండేదన్నారు.

కానీ ఈ విషయమై మీడియాతో గవర్నర్ మాట్లాడడం సరైంది కాదని మంత్రి జగదీష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాజ్ భవన్ కు, ప్రగతి భవన్ కి మధ్య గ్యాప్ వచ్చిందని తాము ఏనాడూ కూడా చెప్పలేదన్నారు. కానీ గవర్నర్ వ్యాఖ్యలను బట్టి చూస్తే గ్యాప్ వచ్చిందని అర్ధం అవుతుందని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. గవర్నర్ వ్యవస్థను ఉపయోగించుకొని బీజేపీ రాజకీయం చేయాలనే ప్రయత్నం చేస్తుందని ఆయన విమర్శించారు.