ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. బోథ్ సమీపంలోని పొచ్చెర జలపాతాన్ని ఆయన ఆదివారం సందర్శించారు. జలపాతం వద్దకు వచ్చిన పర్యాటకులతో మాట్లాడిన ఆయన...ఫోటోలకు ఫోజులిచ్చారు.

అనంతరం ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రకృతి సంపదకు నిలయమైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను సుందర పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణలోనే అత్యంత ఎత్తైన ఈ పొచ్చెర జలపాతాన్ని వీక్షేంచేందుకు వివిధ రాష్ట్రాల నుంచి ఎంతోమంది ఇక్కడికి వస్తున్నారని మంత్రి తెలిపారు.

పర్యాటకుల తాకిడి ఎక్కువవుతుండటంతో ఇక్కడ సౌకర్యాలను కల్పిస్తామని ఇంద్రకరణ్ రెడ్డి హామీ ఇచ్చారు. రూ.850 కోట్లతో చేపట్టిన కుష్టి ప్రాజెక్ట్ పూర్తయితే కంటాల జలపాతం ఏడాది పొడవునా జలప్రవాహంతో కళకళలాడుతుందని ఇంద్రకరణ్ రెడ్డి అభిప్రాయపడ్డారు.