తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు హైదరాబాద్ లో పర్యటించారు. మినిస్టర్స్ రోడ్డు వెంగళరావు నగర్ బస్తీలో సహచర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నగర మేయర్ బొంతు రామ్మోహన్ తో కలిసి పర్యటించారు. వచ్చే ఏడాదికి హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపడతామని హరీష్ చెప్పారు. యాభై ఏళ్లుగా నివసిస్తున్నందున ఎఫ్.టి.ఎల్.సమస్య అడ్డంకి కాదని తేల్చి చెప్పారు. తర్వాత బేగంపేట పాటిగడ్డలోని మోడల్ మార్కెట్ లో "మన కూరగాయలు"ఔట్ లెట్ ను ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా బస్తీ వాసులతో మాట్లాడుతూ హరీష్ తన గురించి తానే సెటైర్ వేసుకున్నారు. దీంతో అక్కడనున్న వారి రియాక్షన్ చూడండి.