పుట్టిన రోజున దుబ్బాకలో మంత్రి హరీశ్ పర్యటన

minister harish rao visits dubbaka
Highlights

పావురాలు ఎగురవేసిన మంత్రి

సిద్ధిపేట : సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాక మినీట్యాంకు బండ్-రామసముద్రం చెరువు వద్ద మంత్రి హరీశ్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగా రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి హరీశ్ రావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి హీరీష్ చేతుల మీదుగా తెల్ల పావురాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, నియోజకవర్గం పరిధిలోని ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, మంత్రి అభిమానులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు ఉన్నారు.

సిద్ధిపేట జిల్లా దుబ్బాక హబ్సీపూర్ చౌరస్తా వద్ద ఆదివారం మధ్యాహ్నం మంత్రి హరీశ్ రావును కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర శాసన సభ అంఛనాల కమిటీ ఛైర్మన్, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగా రెడ్డి, సిద్ధిపేట మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు, కౌన్సిలర్లు బోకే అందించి విషెస్ చెబుతూ స్వీటు తినిపించారు. వీరితో పాటుగా మెదక్ మున్సిపల్ ఛైర్మన్ మల్లిఖార్జున్ గౌడ్, దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని వివిధ మండలాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, అభిమాన నాయకులు, జర్నలిస్టులు, పాత్రికేయులు విషెస్ చెప్పారు.

నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాకలో ఆదివారం రూ.5కోట్ల వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ ఐటీఐ కళాశాల భవన నిర్మాణానికి మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రామలింగా రెడ్డిలతో కలిసి శంకుస్థాపన చేశారు. మండల కేంద్రమైన దుబ్బాకలో ఆదివారం రూ.1కోటి వ్యయంతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ భవనాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. రూ.16.85లక్షల వ్యయంతో నిర్మించిన విద్యుత్ ఏడీఈ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యుత్‌ శాఖ ఎస్ఈ కరుణాకర్ బాబు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మంత్రి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఎస్డీఎఫ్ నిధులు రూ.17కోట్ల వ్యయంతో నిర్మించనున్న సమీకృత భవన నిర్మాణానికి మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఇంటిగ్రేటెడ్ భవనాన్ని నిర్మిస్తున్న కాంట్రాక్టరు ఆధ్వర్యంలో జననేతకు జన్మదిన వేడుక సందర్భంగా భారీ కేక్ కట్ చేసి సంబురాలలో పాల్గొన్నారు. అనంతరం భీమసేనా ఆధ్వర్యంలో రూపొందించిన పాటల సీడీని ఆవిష్కంచారు.

loader