Asianet News TeluguAsianet News Telugu

భారత్‌లో మళ్లీ కరోనా కలకలం.. తెలంగాణ అప్రమత్తం, సాయంత్రం అధికారులతో హరీశ్ రావు సమీక్ష

దేశంలో కరోనా కలకలం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సాయంత్రం వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించనున్నారు.
 

minister harish rao to hold review meeting on health department officials over omicron bf 7 variant
Author
First Published Dec 22, 2022, 3:35 PM IST

కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్.7పై తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణీకులకు  విమాన సిబ్బంది థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. సాయంత్రం వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి హరీశ్ రావు భేటీ కానున్నారు. కరోనా నివారణ చర్యలతో పాటు సన్నద్ధతపై సమీక్షించనున్నారు మంత్రి. 

కాగా... ప్ర‌పంచవ్యాప్తంగా ప‌లు దేశాల్లో క‌రోనా వైర‌స్ కేసులు క్ర‌మంగా పెర‌గుతున్నాయి. జ‌పాన్, చైనా, అమెరికా, స‌హా ప‌లు ఆసియా దేశాల్లో క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీనికి ఇటీవ‌ల గుర్తించిన కొత్త వేరియంట్లే కార‌ణ‌మ‌ని వైద్య నిపుణులు పేర్కొంటున్నాయి. తాజాగా సంబంధిత వేరియంట్లు భార‌త్ లోనూ వెలుగులోకి వ‌చ్చాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మైన కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా అధ్యక్షతన క‌రోనా ప‌రిస్థితుల‌పై సమావేశమైన ఒక రోజు తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైతం గురువారం నాడు కోవిడ్-19పై సమీక్షా సమావేశం నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌లు రాష్ట్ర ప్ర‌భుత్వాలు సైతం క‌రోనా కేసులు పెరుగుతున్న క్ర‌మంలో అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. క‌రోనా మార్గ‌ద‌ర్శ‌కాలు త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచిస్తున్నాయి. 

అసలేంటీ బీఎఫ్ 7 వేరియంట్ :

ఈ నేపథ్యంలోనే బీఎఫ్ 7 వేరియంట్ గురించి తెలుసుకుందాం. ఒమిక్రాన్ నుంచి పరిణామం చెందిన వేరియంట్లు చాలా ఉన్నాయి. అందులో బీఏ.2, బీఏ.5 వేరియంట్లు మిగతా వాటికంటే బలంగా ఉన్నాయి. ఈ బీఏ.5 ఒమిక్రాన్ వేరియంట్ సబ్ లీనియేజ్ బీఏ.5.2.1.7. దీన్నే షార్ట్‌గా బీఎఫ్.7. ఇప్పటి వరకు తెలిసిన కరోనా వేరియంట్‌లలో అన్నింటికంటా వేగంగా వ్యాప్తి చెందే సామర్థ్యం కలిగినది ఈ బీఎఫ్.7 వేరియంటే. ఇన్ఫెక్షన్ ఎబిలిటీ ఎక్కువ. దీని ఇంక్యుబేషన్ పీరియడ్ తక్కువ. అందుకే వేగంగా వ్యాప్తి చెందుతున్నది. ఒకరి నుంచి మరొకరు వ్యాపించే శక్తి, రీప్రొడక్షన్ వ్యాల్యూ ఈ వేరియంట్‌కు ఎక్కువ. అంటే.. ఒకరికి ఈ వేరియంట్ సోకిన తర్వాత మరొకరికి కూడా వేగంగా వ్యాప్తి చెందుతుంది. కరోనా టీకాలు తీసుకున్న వారికి కూడా సోకే శక్తి ఈ వేరియంట్‌కు ఉన్నది.

ALso REad: చైనాను వణికిస్తున్న కరోనా వేరియంట్ బీఎఫ్.7 స్వభావం?.. సోకితే వచ్చే లక్షణాలు ఏమిటీ?

అయితే, గతంలో కరోనా వైరస్‌ను ఎదుర్కొన్న అనుభవం లేని, లేదా దాన్ని ఎదుర్కొనే శక్తి చైనీయుల రోగ నిరోధశక్తికి లేని కారణంగా (లో లెవెల్ ఆఫ్ ఇమ్యూనిటీ) ఈ వేరియంట్ అక్కడ కార్చిచ్చులా వ్యాపిస్తున్నదని తెలుస్తున్నది. మన దేశంలో ఇది వరకే శక్తిమంతమైన వేరియంట్లను ఎదుర్కొని.. వాటిని నిలువరించే రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం వల్ల ఈ వేరియంట్ వల్ల కొంత ప్రమాదం తక్కువే అని నిపుణులు అంచనా వేస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios