Asianet News TeluguAsianet News Telugu

మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డే అంటారా..!: బండి సంజయ్ కు హరీష్ స్ట్రాంగ్ కౌంటర్

తెలంగాణలో మెడికల్ కాలేజీల ఏర్పాటు అనుమతుల విషయంలో అధికార బిఆర్ఎస్, ప్రతిపక్ష బిజెపి నాయకుల మధ్య మాటల యుద్దం సాగుతోంది. 

Minister Harish Rao Strong Counter to TBJP Chief Bandi Sanjay AKP
Author
First Published Jun 9, 2023, 4:25 PM IST

సిద్దిపేట : తెలంగాణ ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ఏర్పాటుచేస్తే ప్రధాని మోదీ, కేంద్ర ఆరోగ్య మంత్రి  మన్సుక్ మాండవీయకు బిజెపి ఎంపీ బండి సంజయ్ ధన్యవాదాలు చెప్పడం విడ్డూరంగా వుందని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ అన్నారు. ఒక్కో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం రూ.500 కోట్లు ఖర్చుచేస్తోందని... అలాంటిది కేంద్రమే వీటిని ఏర్పాటు చేస్తోందంటూ బిజెపి ప్రచారం దుర్మార్గమని అన్నారు. చివరకు మందికి పుట్టిన బిడ్డ తమదే అనేలా బిజెపి తయారయ్యిందని హరీష్ రావు మండిపడ్డారు. 

తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్దిపేటలో జరిగిన సంక్షేమ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి హరీష్. ఈ క్రమంలోనే తెలంగాణలో మెడికల్ కాలేజీల అనుమతులపై బండి సంజయ్ చేసిన కామెంట్స్ కు హరీష్ ఘాటుగా కౌంటరిచ్చారు. 

నేషనల్ మెడికల్ కమీషన్ స్వయం ప్రతిపత్తి గల సంస్థ అని... అన్నీ సరిగ్గా వున్నాయో లేదో పరిశీలించి మెడికల్ కాలేజీలకు అనుమతి ఇస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన మెడికల్ కాలేజీలను కూడా పరిశీలించి అన్ని బాగున్నాయని నిర్దారించుకుని అనుమతి ఇచ్చిందన్నారు. ఇలా తెలంగాణలో 9 ప్రభుత్వ కాలేజీలకు, 4 ప్రైవేట్ కాలేజీలకు ఎన్ఎంసి అనుమతులు ఇచ్చిందన్నారు. కానీ బిజెపి నాయకులు తెలంగాణలో మెడికల్ కాలేజీలను కేంద్రమే ఏర్పాటుచేసింది అనేలా డబ్బా కొడుతూ ప్రచారం చేస్తున్నారని హరీష్ మండిపడ్డారు. 

Read More  దేశంలో కొత్తగా 50 మెడికల్ కాలేజీలు : ఏపీ, తెలంగాణలకు కూడా.. ఏ రాష్ట్రానికి ఎన్నంటే..?

రాత్రింబవళ్లు కష్టపడి, వందల కోట్ల నిధులు ఖర్చుచేసి మెడికల్ కాలేజీలు ఏర్పాటుచేసుకున్నామని హరీష్ తెలిపారు. ఇందులో ప్రధాని మోదీ, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్ మాండవీయ, కేంద్ర ప్రభుత్వం పాత్రతో పాటు బండి సంజయ్ పాత్ర కూడా ఏమీ లేదంటూ ఎద్దేవా చేసారు.మేమే మెడికల్ కాలేజీ పెట్టామంటున్న సంజయ్ ఎంపీగానే వున్నారుగా...  ఏనాడైనా తాను ప్రాతినిధ్యం వహించే కరీంనగర్ కు మెడికల్ కాలేజీ కావాలని మాట్లాడారా... ఎవరికైనా కనీసం దరఖాస్తు పెట్టాడా? అని హరీష్ ప్రశ్నించారు. అలాంటిది మెడికల్ ఏర్పాటులో ముఖ్య పాత్ర తమదేనంటూ మట్లాడటం కంటే దుర్మార్గం, దారుణం మరేమీ వుండదని హరీష్ అన్నారు. 

కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ అయనా ఇచ్చిందా... ఒక్క పైసా అయినా ఇచ్చారా? అని హరీష్ ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు ఇస్తే అందులో తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని అన్నారు. ఇచ్చిన ఒక్క ఎయిమ్స్ అభివృద్ది దిక్కులేదు... మెడికల్ కాలేజీలు తెచ్చామని చెప్పుకుంటున్నారని బిజెపి నాయకులపై మండిపడ్డారు. ఇప్పటివరకు కేసీఆర్ సర్కార్ ఏర్పాటుచేసిన 21 మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసి అనుమతి మాత్రమే ఇచ్చిందన్నారు. అంతేగానీ మెడికల్ కాలేజీలు తమవే అంటే బిజెపి నాయకులు మాట్లాడితే ప్రజలు నవ్విపోతారని హరీష్ అన్నారు. 

ఇతరులు చేసింది కూడా తామే చేసామని చెప్పుకోవడం బిజెపి నాయకులకు బాగా అలవాటని హరీష్ అన్నారు. ఇలా తప్పుడు ప్రచారాలు చేసుకుంటున్న బిజెపి తల దించుకోవాలని... బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు. నిజంగానే టి బిజెపి నాయకులకు అంత దమ్ముంటే విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సవాల్ చేసారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ, ట్రైబల్ యూనివర్సిటీ, పవర్ ప్లాంట్, జాతీయ హోదా తదితర హామీలను నెరవేర్చేందుకు పోరాటం చేయాలి... ఇవి ఇప్పిచి మీకు ఇష్టమొచ్చిన ప్రచారం చేసుకోవాలని మంత్రి హరీష్ సూచించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios