Asianet News TeluguAsianet News Telugu

రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను దెబ్బతీసేందుకు కేంద్రం కుట్ర.. అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు

ప్రతి ఇంటికి స్వచ్చమైన తాగునీరు అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ నిలిచిందని మంత్రి హరీష్ రావు అన్నారు. ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా తెలంగాణ మారిందని కేంద్రం పార్లమెంట్‌లో ప్రకటించిందని చెప్పారు.

Minister Harish rao Speech in assembly
Author
First Published Sep 13, 2022, 2:50 PM IST

ప్రతి ఇంటికి స్వచ్చమైన తాగునీరు అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ నిలిచిందని మంత్రి హరీష్ రావు అన్నారు. ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా తెలంగాణ మారిందని కేంద్రం పార్లమెంట్‌లో ప్రకటించిందని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. తాము ప్రజల అవసరాలు, ఆకాంక్షలు తీర్చడం కోసమే నిధులను ఖర్చు చేస్తున్నామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిధులు వృథా కాలేదని.. అత్యంత వేగంగా ప్రాజెక్టు పూర్తి చేసుకోవడం ద్వారా తెలంగాన ప్రజల ధనం ఆదా అయిందని తెలిపారు. 

ఎఫ్‌ఆర్‌బీఎం రుణపరిమితి పేరుతో కేంద్రం రాష్ట్రాలను ఇబ్బంది పెడుతుందని హరీష్ రావు మండిపడ్డారు. ఏకపక్షంగా ఎఫ్‌ఆర్‌బీఎం చట్టంలో మార్పులు చేశారని అన్నారు. రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను దెబ్బతీసేందుకు కేంద్రం కుట్ర చేస్తుందని ఆరోపించారు. కేంద్రానికి ఒక నీతి.. రాష్ట్రానికి మరో నీతి ఉంటుందా? అని ప్రశ్నించారు. కేంద్రం ద్వంద్వ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టుగా తెలిపారు. ఎఫ్‌ఆర్‌బీఎం నిధుల్లో రాష్ట్రాలకు మాత్రమే కోతలు విధించారని విమర్శించారు. రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని.. బాయిలకాడ మీటర్లు పెట్టబోమని సీఎం కేసీఆర్ చెప్పారని అన్నారు. ఆర్థిక సంఘం సిఫార్సులను కేంద్రం పట్టించుకోలేదని ఆరోపించారు. 

Also Read: కొత్త‌ పార్ల‌మెంట్ భ‌వ‌నానికి బీఆర్ అంబేద్క‌ర్ పేరు పెట్టాలి.. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన కేటీఆర్

తెలంగాణకు రూ. 6,268 కోట్లు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం చెప్పిందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్రం ఆపిందని విమర్శించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు నిధులు ఇవ్వాలని నీతిఆయోగ్ చెప్పిందని అన్నారు. నీతిఆయోగ్‌ చెప్పినప్పటికీ రాష్ట్రానికి రూపాయి ఇవ్వలేదని తెలిపారు. సెస్సుల పేరుతో కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన ఆదాయం సమకూర్చుకుంటుందని ఆరోపించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios