Asianet News TeluguAsianet News Telugu

కిరాయి మనుషులను తెచ్చుకుంటున్నారు: కాంగ్రెస్, బీజేపీలపై హరీశ్ నిప్పులు

బీజేపీ ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తుందని ప్రశ్నించారు తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీశ్ రావు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఉద్యమం చేస్తోందని ఆయన తెలిపారు. 

minister harish rao slams congress and bjp over dubbaka by polls ksp
Author
Hyderabad, First Published Oct 28, 2020, 5:25 PM IST

బీజేపీ ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తుందని ప్రశ్నించారు తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీశ్ రావు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఉద్యమం చేస్తోందని ఆయన తెలిపారు.

కాంగ్రెస్, బీజేపీలు అబద్ధపు పునాదులపై ఓట్లు పొందాలని చూస్తున్నాయని హరీశ్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వాళ్లకు పరాయి లీడర్లు, కిరాయి మనుషులు వున్నారని.. పక్క జిల్లాల నుంచి మనుషులను తెచ్చుకుంటున్నారని హరీశ్ రావు ధ్వజమెత్తారు.

ఈ ఏడాది ఏప్రిల్ 27న అగ్రికల్చ‌ర్ బిల్లుల‌ను కేంద్రం తెచ్చింది. స‌బ్సిడీ లేకుండా బిల్లు ఇవ్వాల‌ని మే 17న కేంద్రం రాష్ర్టానికి లేఖ రాసింది. బావుల వ‌ద్ద మీట‌ర్లు పెడితే రూ. 2500 కోట్లు ఇస్తామ‌న్నారు.

బావుల ద‌గ్గ‌ర మీట‌ర్లు పెట్టే ప్ర‌స‌క్తే లేద‌ని జూన్ 2న కేంద్రానికి సీఎం కేసీఆర్ లేఖ రాశార‌ని హ‌రీష్ రావు గుర్తు చేశారు. రైతుల‌ను మోసం చేస్తున్న బీజేపీని 300 మీట‌ర్ల లోతులో పాతిపెట్టాల‌ని సూచించారు.

కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో పంట‌లు ఎండిపోయేవి. ముత్యం రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడు రూ. 30 వేలు ఇస్తేనే ట్రాన్స్‌ఫార్మ‌ర్లు ఇచ్చేవార‌ని గుర్తు చేశారు. విదేశీ మ‌క్క‌ల‌ను దిగుమ‌తి చేసుకుంటే.. ఇక్క‌డి మ‌క్క‌లు ఎవ‌రు కొంటారు? అని ప్ర‌శ్నించారు.

ఎవ‌రీ ప్ర‌యోజ‌నాల కోసం భార‌తీయ జ‌న‌తా పార్టీ ప‌ని చేస్తుంద‌ని మంత్రి హ‌రీష్ రావు ధ్వ‌జ‌మెత్తారు. న్న‌ది అర‌గ‌క రైతులు ఆత్మ‌హ‌త్యలు చేసుకుంటున్నార‌ని చంద్ర‌బాబు ప‌ద‌వీ కాలంలో బీజేపీ నాయ‌కులు అన్నార‌ని మంత్రి గుర్తు చేశారు.

వ్య‌వ‌సాయం దండ‌గా కేంద్రమంత్రిగా ఉన్న‌ప్పుడు బండారు ద‌త్తాత్రేయ వ్యాఖ్యానించార‌ని తెలిపారు. కాలిపోయే మోటార్లు కావాలా? ‌బావుల వ‌ద్ద మీట‌ర్లు కావాలా? నాణ్య‌మైన 24 గంట‌ల ఉచిత విద్యుత్ కావాలో నిర్ణ‌యించుకోవాల్సిందే రైతులే అని మంత్రి హ‌రీష్ రావు వ్యాఖ్యానించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios