కాంగ్రెస్, బీజేపీలపై సెటైర్లు వేశారు మంత్రి హరీశ్ రావు . తాము వదిలేసిన , పక్కకు పెట్టేసిన నేతలను కాంగ్రెస్ తీసుకుంటుందోని మంత్రి చురకలంటించారు. కాంగ్రెస్ పాలనంటే కరెంట్ కోసం కళ్లలో వత్తులేసుకుని ఎదురుచూడాలని.. చెరువులకు చెప్పులు పెట్టాలని హరీశ్ దుయ్యబట్టారు.

కాంగ్రెస్, బీజేపీలపై సెటైర్లు వేశారు మంత్రి హరీశ్ రావు. ఆదివారం రంగారెడ్డి జిల్లా కల్వకుర్తిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన అనంతరం మాట్లాడుతూ.. తాము వదిలేసిన , పక్కకు పెట్టేసిన నేతలను కాంగ్రెస్ తీసుకుంటుందోని మంత్రి చురకలంటించారు. ఆ పార్టీకి నేతలు లేరని.. ఇక్కడ చెల్లని రూపాయి అక్కడ చెల్లుతుందా , పనికిరారనే ఉద్దేశంతోనే పక్కకుపెట్టామని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అంటే కేసీఆర్‌కు చాలా ఇష్టమన్నారు. 

కాంగ్రెస్ పాలన అంటే అర్ధరాత్రి కరెంట్, ట్రాన్స్‌‌ఫార్మర్లు కాలిపోవడాలేనని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. సాగునీరు, కరెంట్‌ను బీఆర్ఎస్ ఇచ్చిందని.. రైతుబంధు, రైతు బీమాలను కాంగ్రెస్ ఇచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనంటే కరెంట్ కోసం కళ్లలో వత్తులేసుకుని ఎదురుచూడాలని.. చెరువులకు చెప్పులు పెట్టాలని హరీశ్ దుయ్యబట్టారు. కేసీఆర్ సీఎం అయ్యాక పల్లె, బస్తి దవాఖానాలు, జిల్లాకో మెడికల్ కాలేజీ, నియోజకవర్గాల్లో వంద పడకల ఆసుపత్రులు వచ్చాయని మంత్రి చెప్పారు. 

ALso REad: ప్రధాని మోడీ కామెంట్లపై కేటీఆర్ కౌంటర్.. ‘దేశ ప్రజలు కేంద్రంలో మార్పు కోరుతున్నారు’

విపక్షాలకు దిమ్మతిరిగే పోయేలా మేనిఫెస్టో ప్రకటన వుంటుందని .. ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను కేసీఆర్ పూర్తి చేశారని హరీశ్ రావు వెల్లడించారు. విభజన చట్టంలోనే గిరిజన యూనివర్సిటీ హామీ ఇచ్చారని.. మరి బయ్యారం, కోచ్ ఫ్యాక్టరీ ఎప్పుడు ఏర్పాటు చేస్తారని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకుంటున్నారని.. గెలిస్తే రాష్ట్రాన్ని అమ్ముకుంటారని హరీశ్ రావు ఆరోపించారు.