ప్రస్తుతం భారత్‌లో విలయతాండవం సృష్టిస్తున్న కరోనా వైరస్.. ఎన్నో కుటుంబాల్లో తీరని విషాధాలను నింపుతోంది. ఇంటి పెద్దను కోల్పోయి ఎందరో రోడ్డునపడ్డారు. అలాంటి వారిని పలువురు మనసున్న వ్యక్తులు ఆదుకుంటున్నారు. తాజాగా మంత్రి హరీశ్ రావు తన పెద్ద మనసు చాటుకున్నారు.
ప్రస్తుతం భారత్‌లో విలయతాండవం సృష్టిస్తున్న కరోనా వైరస్.. ఎన్నో కుటుంబాల్లో తీరని విషాధాలను నింపుతోంది. ఇంటి పెద్దను కోల్పోయి ఎందరో రోడ్డునపడ్డారు. అలాంటి వారిని పలువురు మనసున్న వ్యక్తులు ఆదుకుంటున్నారు. తాజాగా మంత్రి హరీశ్ రావు తన పెద్ద మనసు చాటుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. నాయి బ్రాహ్మణుడు అయిన కొత్వాల్ శ్రీనివాస్ అనే వ్యక్తి సిద్దిపేటలోనే కులవృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. హాయిగా సాగిపోతున్న ఇతని కుటుంబాన్ని కరోనా కాటు వేసి అతలాకుతలం చేసింది. గత వారం క్రితం శ్రీనివాస్‌కు కరోనా సోకింది. హోమ్ ఐసోలేషన్ లో వుండగానే అతని ఆరోగ్యం విషమించి రెండు రోజుల క్రితం మృతి చెందాడు. దీంతో అతని భార్యాబిడ్డలు రోడ్డున పడ్డారు. చివరికి సొంత ఇల్లు లేకపోవటంతో శ్రీనివాస్ అంత్యక్రియల తర్వాత వారు అద్దె ఇంట్లోనే ఉన్నారు. శ్రీనివాస్ భార్య వద్ద చిల్లి గవ్వ కూడా లేకపోవటంతో ఇంటి ఓనర్ ఇంట్లో నుండి గెంటివేశాడు. దీంతో వారు ఎక్కడికి వెళ్ళాలో తెలియక భర్త అంత్యక్రియలు జరిగిన స్మశానంలోనే ఉండసాగారు.
Also Read:గ్రామ జనాభా 250.. కేసుల సంఖ్య 100: ఓ పెళ్లిలో ఒక్కరి నుంచి వూరంతా వైరస్
ఈ విషయం తెలుసుకొని చలించిపోయిన మంత్రి హరీష్ రావు... శ్రీనివాస్ భార్యాబిడ్డలు ఉండటానికి ఇల్లు, నిత్యావసరాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. వెంటనే ఆ కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేశారు. ప్రస్తుతం వారు ఆ ఇంట్లోకి వచ్చారు. అంతేకాకుండా హరీష్ రావు స్వయంగా ఫోన్ చేసి.. ఎలాంటి సహాయం కావాలన్నా తనను సంప్రదించవచ్చని భరోసానిచ్చారు. అంతేకాకుండా పిల్లలను ఉచితంగా చదివించే బాధ్యత తనేదేనని తెలిపారు. హరీష్ రావు చేసిన సహాయం పట్ల శ్రీనివాస్ భార్య ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
