ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై ప్రశంసలు కురిపించారు మంత్రి హరీశ్ రావు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆచరిస్తే.. దేశంలో అనుసరిస్తోందన్నారు. రాష్ట్రాన్ని సీఎం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టారని హరీశ్ రావు ప్రశంసించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై ప్రశంసలు కురిపించారు మంత్రి హరీశ్ రావు. గురువారం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో ముఖ్యమంత్రితో కలసి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హరీశ్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో రాష్ట్రానికి అవార్డుల పంట పండుతోందన్నారు. రాష్ట్రాన్ని సీఎం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టారని హరీశ్ రావు ప్రశంసించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆచరిస్తే.. దేశంలో అనుసరిస్తోందన్నారు. పటాన్ చెరులో రూ.200 కోట్లతో నిర్మాణం కానున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు.
కాంగ్రెస్ హయాంలో పటాన్ చెరులోని పరిశ్రమలకు పవర్ హాలిడేలు వుండేవని..ఇప్పుడు ఎక్కడా కరెంట్ కోతలు లేవని మంత్రి స్పష్టం చేశారు. సంగారెడ్డికి మెడికల్ కాలేజ్ ఇస్తానని మాటిచ్చిన కేసీఆర్ మాట నిలబెట్టుకున్నారని హరీశ్ రావు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో 70 శాతం డెలివరీలు ప్రభుత్వాసుపత్రుల్లోనే జరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు. మన పిల్లలు చదువుకునేందుకు ఉక్రెయిన్, రష్యాకి వెళ్లాల్సిన అవసరం లేదని హరీశ్ రావు స్పష్టం చేశారు.
ALso Read: తెలంగాణలో భూమి బంగారం .. చంద్రబాబే ఒప్పుకున్నారు : కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రస్తుతం భూమి బంగారం అయ్యిందన్నారు. తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే.. ఆంధ్రాలో 50 ఎకరాలు కొనుక్కోవచ్చని స్వయంగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడే అన్నారని గుర్తుచేశారు. ఒకప్పుడు ఆంధ్రాలో ఎకరం అమ్మితే తెలంగాణలో పదెకరాలు కొనుక్కోవచ్చని అనుకునేవారని కేసీఆర్ అన్నారు. మళ్లీ బీఆర్ఎస్‌ను గెలిపిస్తే పటాన్ చెరు నుంచి హయత్ నగర్ వరకు మెట్రోను ఏర్పాటు చేస్తామన్నారు తెలంగాణ సీఎం . పటాన్ చెరును రెవెన్యూ డివిజన్‌గా చేయాలనే ప్రతిపాదన వుందన్నారు. పటాన్ చెరులో కాలుష్య నియంత్రణకు రాజీవ్ శర్మ ఎన్నో సిఫారసులు చేశారని కేసీఆర్ తెలిపారు.
