Asianet News TeluguAsianet News Telugu

ఇక చాలు.. ఆపు.. :హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ కు క్లాస్ పీకిన మంత్రి హరీష్ రావు...

తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావును వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు క్లాస్ పీకారని తెలుస్తోంది. రాజకీయ ప్రకటనలు చేసింది చాలని.. ఆపాలని సున్నితంగా సూచించారట. 

Minister Harish Rao gave a class to Health Director Gadala Srinivas - bsb
Author
First Published Aug 21, 2023, 12:47 PM IST

హైదరాబాద్ : తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు... రాష్ట్ర హెల్త్ డైరెక్టర్గా పనిచేస్తున్న గడల శ్రీనివాసరావుకు క్లాస్ పీకారు. ఇటీవల కాలంలో గడల శ్రీనివాసరావు అనేక సందర్భాల్లో రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు. కాస్త హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయం మీదే శ్రీనివాసరావును హరీష్ రావు మెత్తగా హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. 

ఈ మేరకు హరీష్ రావు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ కి ఫోన్ చేసినట్లు సమాచారం. గడల శ్రీనివాస్ పలు సందర్భాల్లో రాజకీయ ప్రకటనలు చేస్తున్న విషయంగా మాట్లాడుతూ.. మానుకోవాలని చిన్నపాటి వార్నింగ్ ఇచ్చారట. రాష్ట్ర ప్రభుత్వ అధికారిగా ఉన్న శ్రీనివాస్ వరుసగా ఇలాంటి రాజకీయ ప్రకటనలతో ఇటీవల కాలంలో వార్తల్లోకి ఎక్కుతుండడంతో  మంత్రి హరీష్ రావు ఎట్టకేలకు రంగ ప్రవేశం చేసినట్టుగా తెలుస్తోంది.

నేడు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా: కవిత ఇంటికి నేతల క్యూ

రాష్ట్ర వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ గా ఉన్న గడల శ్రీనివాసరావు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరపున టికెట్ను ఆశిస్తున్నాడు. నేడు డిఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు రంగం సిద్ధమయ్యింది.  సాయంత్రంలోపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ జాబితాను విడుదల చేయనున్నారు. 

గడల శ్రీనివాస్ కొత్తగూడెం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. . ఈ క్రమంలోనే మంత్రి హరీష్ రావు డైరెక్టర్ శ్రీనివాసరావుకు ఇలా ఫోన్ చేసి చెప్పడం స్వీట్ వార్నింగ్ లాంటిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉండగా, తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ డిహెచ్ శ్రీనివాసరావు ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతం మరోసారి వార్తల్లోకి ఎక్కారు. నేరుగా అధికార పార్టీ ఎమ్మెల్యేలపై విమర్శలు చేశారు. ఈసారి ఎన్నికల్లో డిహెచ్ శ్రీనివాసరావు కొత్తగూడెం నియోజకవర్గంలో నుంచి పోటీ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన కొంతకాలం క్రితం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 

ఆయన మీద జరుగుతున్న ప్రచారానికి ఊతం ఇచ్చినట్టుగా ఉన్నాయి. అంతేకాదు, ఆయన వ్యాఖ్యలు స్థానికంగా అధికార పార్టీలో చిచ్చుపెట్టాయి. పాల్వంచ మండలంలో పర్యటించిన డిహెచ్ శ్రీనివాసరావు కొత్తగూడెం ఎమ్మెల్యే వనామా వెంకటేశ్వర్లపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

ఆయనకు 80 ఏళ్లు అని.. దశాబ్దాలుగా ఆయన రాజకీయాల్లో ఉన్నారని.. చాలా పెద్దవారు అయిపోయారని.. ఆయనకిక విశ్రాంతినిద్దాం అంటూ..  డిహెచ్ వ్యాఖ్యానించారు. తాను హాజరైన సభకు చాలా తక్కువ మంది ప్రజాప్రతినిధులు హాజరయ్యారని..  తను ప్రజల్ని కలిసేందుకు వచ్చానని.. మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగిగా.. ఉద్యోగులందరికీ 60 ఏళ్లు రాగానే రిటైర్మెంట్ ఇచ్చేస్తారని.. మన స్థానిక ప్రజాప్రతినిధికి 80ఏళ్లని..  ఇప్పటికే ఆయన చాలా కాలం ప్రజాసేవ చేశారని చెప్పుకొచ్చారు. 

ఆయన నియోజకవర్గానికి చాలా సేవ చేశారని…ఆయనకు కాస్త రెస్ట్ ఇద్దామని అన్నారు. గత ఎన్నికల్లో  ఇవే తన చివరి ఎన్నికలని… ఒకసారి అవకాశం ఇవ్వమని అడిగారు. ఈసారి కూడా అలాగే జరిగే అవకాశం ఉంది. ఎన్నిసార్లు అవకాశాలు ఇస్తాం. ఎవరికి వాళ్లు ఆలోచించుకోవాలి. గడల శ్రీనివాస్ కార్యక్రమానికి వస్తే అది కట్ చేస్తా,  ఇది కట్ చేస్తా..  ఉన్న పదవి పీకేస్తా…దళిత బంధు రాకుండా చేస్తా.. ఇంకేదో స్కీం కట్ చేస్తా అనేది ఎంతకాలం నడుస్తుంది.. ఇంకా నాలుగు నెలలు మాత్రమే.

కేవలం నాలుగు నెలలు మాత్రమే. ఎందుకంటే ఈ మాటలు నేను  బాధతో చెబుతున్నా.. నా మనుషులున్ని, నా కుటుంబ సభ్యుల్ని నా దగ్గరికి రాకుండా చేస్తున్నారనే బాధతో చెబుతున్నా.. అని చెప్పుకొచ్చారు. కొత్తగూడెంలోని ప్రతీ ఒక్కరినీ ఇలాగే బెదిరిస్తున్నాడు. ఇక్కడికి వచ్చినవారెవ్వరూ ఒక్క రూపాయి కూడా తీసుకుని వచ్చినవారు కాదు. మీ అందరికీ జీవితాంతం రుణపడి ఉంటా అని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios