ఇంతమంది బలిదానాలకు కాంగ్రెస్, బీజేపీలు కారణం కాదా అని తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. పార్లమెంట్‌లో ప్రధాని మోడీ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఏడేళ్లయినా విభజన హామీలు ఎందుకు నెరవేర్చలేదని మంత్రి నిలదీశారు. 2004లోనే తెలంగాణ ఇచ్చి వుంటే అంతమంది చనిపోయేవారా అని హరీశ్ ప్రశ్నించారు.
పార్లమెంట్‌లో ప్రధాని మోడీ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు (harish rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మోడీ ఎంత వ్యతిరేకమో ఆయన మాటలు చెబుతున్నాయని మంత్రి మండిపడ్డారు. ఈ రోజు ఆయన అక్కసునంతా వెళ్లగక్కారని.. దీనిని తెలంగాణ ప్రజలు గమనించాలన్నారు. మోడీ , బీజేపీ నేతలు ఈరోజు తెలంగాణకు వ్యతిరేకంగా వున్నారని.. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడిప్పుడే తెలంగాణ ఒడ్డున పడుతోందని మంత్రి చెప్పారు.
ఇంతమంది బలిదానాలకు కాంగ్రెస్, బీజేపీలు కారణం కాదా అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఏడేళ్లయినా విభజన హామీలు ఎందుకు నెరవేర్చలేదని మంత్రి నిలదీశారు. 2004లోనే తెలంగాణ ఇచ్చి వుంటే అంతమంది చనిపోయేవారా అని హరీశ్ ప్రశ్నించారు. రాష్ట్ర బీజేపీ నేతలు ఇప్పటికైనా కళ్లు తెరవాలని.. దళితుల కోసం తాము దళిత బంధు తీసుకొచ్చామని అలాగే ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని మంత్రి గుర్తుచేశారు. తెలంగాణపై ఇంత చిన్నచూపు ఎందుకని హరీశ్ రావు ప్రశ్నించారు. ఉత్తర భారతానికి ఒక నీతి, దక్షిణ భారతానికి ఒక నీతా అని మంత్రి నిలదీశారు.
తెలంగాణ ప్రభుత్వం రైతును కాపాడే ప్రయత్నం చేస్తే., బీజేపీ ప్రభుత్వం రైతును ముంచే ప్రయత్నం చేస్తోందని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. రైతులకు పెట్టుబడి వ్యయాన్ని పెంపు చేస్తోందని, కొనుగోలు తగ్గిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం సిలిండర్లు, ఎరువులు ఇతరత్రాలపై సబ్సిడీ పేరిట కోతలు, వాతలు తప్ప కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు చేసిందేమీ లేదని హరీశ్ దుయ్యబట్టారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులుగా ఈ విషయాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని పార్టీ శ్రేణులకు మంత్రి పిలుపునిచ్చారు.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసం ఉత్తర భారత దేశంలో ధరలు పెంచలేదని ఆయన ఆరోపించారు. దక్షిణ భారతదేశ ప్రాంతంలో కాంప్లెక్స్ ఎరువులు, యూరియా, డీఏపీ, పొటాషియం ఎక్కువగా వాడతారని కేంద్రం ధరలు పెంచి పక్షపాత వైఖరి చూపించిందని హరీశ్ నిప్పులు చెరిగారు. ఉత్తర భారత దేశంలో యూరియా, డీఏపీ ఎక్కువ వాడకం, దక్షిణ భారతదేశంలో కాంప్లెక్స్ ఎరువుల వాడకం ఎక్కువగా ఉంటుందని.., ఉత్తర దేశంలో యూరియా, డీఏపీ ధరలు పెంపు జోలికి పోకుండా, దక్షిణ భారతదేశంలో కాంప్లెక్స్ ఎరువులకు ధరలు పెంపు చేశారని ఆయన మండిపడ్డారు.
కాగా.. Telangana ను ఇచ్చినా కూడా ఆ రాష్ట్ర ప్రజలు Congress ను నమ్మలేదని Narendra Modi వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం నాడు Rajya Sabhaలో ప్రసంగించారు. సోమవారం నాడు లోక్‌సభలో ఆయన ప్రసంగించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పై విమర్శల దాడిని రెండో రోజూ కూడా ఆయన కొనసాగించారు. రాజ్యసభలో కాంగ్రెస్ పై విమర్శలు చేస్తూనే రాష్ట్ర విభజన అంశంపై మోడీ స్పందించారు.
Andhra pradesh రాష్ట్ర విభజనపై కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి సమస్యలు వచ్చి ఉండేవి కావన్నారు. రాష్ట్ర విభజన సరిగా చేసి ఉంటే ఇలాంటి సమస్యలు వచ్చి ఉండేవి కావన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందని ఆయన చురకలంటించారు. రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకం కాదని Prime Minister మోడీ స్పష్టం చేశారు. విభజన జరిగిన తీరును మాత్రం ఆయన తప్పుబట్టారు. ఏపీకి కాంగ్రెస్ అన్యాయం చేసిందన్నారు. కేంద్రంలో అధికారంలోకి రావడానికి అవకాశం ఇచ్చిన ఏపీకి అన్యాయం చేశారని మోడీ గుర్తు చేశారు. హడావుడిగా రాష్ట్ర విభజన చేశారని మోడీ మండిపడ్డారు.
