Harish Rao : కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటే.. ఆ విషయంతో వారి చీక‌టి ఒప్పందం బట్ట‌బ‌య‌లు 

Harish Rao : సీఎం కేసీఆర్ ను గద్దెదించడానికి.. బీజేపీ, కాంగ్రెస్ లు పార్టీలు కుమ్మక్కయ్యాయనీ, కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి బిజెపిని వీడి కాంగ్రెస్‌కు వెళ్లడమే ఇందుకు నిదర్శనమని బిఆర్‌ఎస్ మంత్రి హరీష్ రావు  పేర్కొన్నారు.

Minister Harish Rao Fire On Rajagopal Reddy Politics KRJ

Harish Rao: తెలంగాణలో సీఎం కేసీఆర్ ను నేరుగా ఎదుర్కొలేక కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కయ్యాయనీ, కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి బిజెపిని వీడి కాంగ్రెస్‌కు వెళ్లడమే దీనికి నిదర్శనమని బిఆర్‌ఎస్ మంత్రి హరీష్ రావు  అన్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో జరిగిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి పన్నిన పెద్ద కుట్రలో భాగమే రాజగోపాల్‌రెడ్డి మళ్లీ కాంగ్రెస్‌లో చేరడం జరిగిందన్నారు.

కోమటిరెడ్డి సోదరులు వెంకట్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పుడు కూడా పొత్తు పెట్టుకున్నారని చెప్పారు. వెంకట్ రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు తమ్ముడు ఉన్న బీజేపీకి మద్దతు ఇచ్చారని, బీజేపీ ఉన్న రాజ్‌గోపాల్‌రెడ్డికి కాంగ్రెస్ బేషరతుగా మద్దతిచ్చిందని విమర్శించారు. రాష్ట్రంలో గత మూడు ఉప ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పనిచేశాయని హరీశ్‌రావు ఆరోపించారు.

అంతేకాకుండా.. బిజెపితో తన సొంత బంధాన్ని కప్పిపుచ్చుకోవడానికి బిఆర్‌ఎస్‌ను 'బిజెపి బి టీమ్' అని కాంగ్రెస్ ఆరోపిస్తుందని పేర్కొన్నారు. కేసీఆర్ విజయాన్ని, రాష్ట్రాభివృద్ధిని జీర్ణించుకోలేక చీకటి ఒప్పందాల్లో భాగంగా కిషన్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ ఎ. రేవంత్ రెడ్డిలు రోజుకో మాట మాట్లాడుకుంటున్నారు. కేసీఆర్ కు రాష్ట్రంపై విజన్ ఉంటే బీజేపీ, కాంగ్రెస్ లకు మాత్రం  విషం ఉందని హరీశ్‌రావు అన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios