మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు కౌంటరిచ్చారు మంత్రి హరీశ్ రావు (harish rao). వానాకాలం పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆయన చెప్పారు. హుజురాబాద్ ఎన్నికల (huzurabad bypoll) ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. వర్షానికి తడిసిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వెల్లడించారు.

మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు కౌంటరిచ్చారు మంత్రి హరీశ్ రావు (harish rao). వానాకాలం పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆయన చెప్పారు. హుజురాబాద్ ఎన్నికల (huzurabad bypoll) ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. వర్షానికి తడిసిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. రైతులు ఈ విషయంపై ఎలాంటి ఆందోళన చెందొద్దని హరీశ్ రావు చెప్పారు. ఖాళీ స్థలం వుంటే ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు ఇస్తామని మంత్రి వెల్లడించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అంతకుముందు ఉదయం పోతిరెడ్డిపేటలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. వర్షాలకు ధాన్యం తడిసిపోతుందని.. వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తనని ఓడించాలని కేసీఆర్ (kcr) కుట్రలు చేస్తున్నారే తప్ప... రైతుల ఇబ్బందులు పట్టించుకోవడం లేదని ఈటల ఎద్దేవా చేశారు. హుజురాబాద్ ప్రజలు ప్రేమకు లొంగుతారు తప్ప.. దౌర్జన్యానికి లొంగరని ఈ విషయాన్ని ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో నిరూపిస్తారని రాజేందర్ తెలిపారు. 

ALso Read:Huzurabad ByPoll: చేతగానోడే దొంగదెబ్బ కొట్టాలని చూస్తాడు: కేసీఆర్‌పై ఈటల సంచలన వ్యాఖ్యలు

ఈటల అనే వాడు ఏకై మేకైండని.. తనను ఖతం చేయాలని కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తన మొహం అసెంబ్లీలో కనిపించకూడదని.. ప్రగతిభవన్ లో కూర్చుని హరీశ్‌కు కేసీఆర్ (kcr) ఆదేశాలిచ్చాడంటూ ఈటల వ్యాఖ్యానించారు. వందల కోట్ల రూపాయలు, లారీల్లో లిక్కర్ సీసాలు, రాజస్థాన్ నుంచి పదివేల గొర్రెలు తెచ్చాడన్నారు . చేతనైనోడైతే.. తమ గురించి చెప్పుకుని ఓట్లు అడుగుతాడని... చేతగానోడు దొంగదెబ్బ కొట్టాలని చూస్తాడంటూ ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు. 

కాగా, టీఆర్ఎస్‌లో కీలకనేతగా వున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ (etela rajender) భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి , మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. అనంతరం ఢిల్లీలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈటల రాజేందర్ రాజీనామాతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో బీజేపీ తరపు నుంచి ఈటల, కాంగ్రెస్ నుంచి వెంకట్ బల్మూరి (venkat balmoor) , టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌లు (srinivas yadav) బరిలో నిలిచారు.