తన మొహం అసెంబ్లీలో కనిపించకూడదని.. ప్రగతిభవన్ లో కూర్చుని హరీశ్‌కు (harish rao) కేసీఆర్ (kcr) ఆదేశాలిచ్చాడంటూ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. వందల కోట్ల రూపాయలు, లారీల్లో లిక్కర్ సీసాలు, రాజస్థాన్ నుంచి పదివేల గొర్రెలు తెచ్చాడన్నారు .  

గతంలో హుజూరాబాద్‌ నియోజకవర్గంలో (huzurabad bypoll) అభివృద్ధిని గురించి ప్రశంసించిన వారే ఇప్పుడు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ నేత , మాజీ మంత్రి ఈటల రాజేందర్ (etela rajender) విమర్శించారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని పోతిరెడ్డిపేట, వెంకట్రావుపల్లిలో ఆదివారం ప్రచారం నిర్వహించిన ఈటల.. టీఆర్ఎస్ (trs) ప్రభుత్వ పాలనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

గత 18 ఏళ్లుగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసినట్లు ఈటల వెల్లడించారు. నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు విమర్శించడం విడ్డూరంగా ఉందని రాజేందర్ మండిపడ్డారు. పదవులు, ప్రలోభాల కోసం విలువలు అమ్ముకోవడం తనకు సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. అందుకే పదవికి రాజీనామా చేసి మళ్లీ జనం ముందుకు వచ్చినట్లు ఈటల వివరించారు.

వర్షాలకు ధాన్యం తడిసిపోతుందని.. వెంటనే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తనని ఓడించాలని కేసీఆర్ కుట్రలు చేస్తున్నారే తప్ప... రైతుల ఇబ్బందులు పట్టించుకోవడం లేదని ఈటల ఎద్దేవా చేశారు. హుజురాబాద్ ప్రజలు ప్రేమకు లొంగుతారు తప్ప.. దౌర్జన్యానికి లొంగరని ఈ విషయాన్ని ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో నిరూపిస్తారని రాజేందర్ తెలిపారు. ఈటల అనే వాడు ఏకై మేకైండని.. తనను ఖతం చేయాలని కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ALso Read:Huzurabad bypoll: బరిలో 27 మంది ఇండిపెండెంట్లు... కమలం, కారును పోలిన గుర్తులు, ఎవరి కొంపముంచుతారో?

తన మొహం అసెంబ్లీలో కనిపించకూడదని.. ప్రగతిభవన్ లో కూర్చుని హరీశ్‌కు (harish rao) కేసీఆర్ (kcr) ఆదేశాలిచ్చాడంటూ ఈటల వ్యాఖ్యానించారు. వందల కోట్ల రూపాయలు, లారీల్లో లిక్కర్ సీసాలు, రాజస్థాన్ నుంచి పదివేల గొర్రెలు తెచ్చాడన్నారు . చేతనైనోడైతే.. తమ గురించి చెప్పుకుని ఓట్లు అడుగుతాడని... చేతగానోడు దొంగదెబ్బ కొట్టాలని చూస్తాడంటూ ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు. 

కాగా, టీఆర్ఎస్‌లో కీలకనేతగా వున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ (etela rajender) భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి , మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. అనంతరం ఢిల్లీలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈటల రాజేందర్ రాజీనామాతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో బీజేపీ తరపు నుంచి ఈటల, కాంగ్రెస్ నుంచి వెంకట్ బల్మూరి (venkat balmoor) , టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌లు (srinivas yadav) బరిలో నిలిచారు.