అమరుల స్పూర్తి ఈ ప్రజ్వలిత దీప్తి..: అమరవీరుల స్మారక చిహ్నంపై హరీష్ రావు

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 

Minister Harish Rao comments on Telangana martyrs memorial AKP

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంకోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల స్మారకార్థం రాజధాని హైదరాబాద్ లో అద్భుత నిర్మాణాన్ని చేపట్టింది కేసీఆర్ సర్కార్. నూతన సచివాలయ భవనానికి ఎదురుగా స్టెయిన్ లెస్ స్టీల్ తో దీపాకృతిలో అత్యద్భుతంగా అమరుల స్మారక చిహ్నాని నిర్మించారు. ఇప్పటికే హుస్సేన్ సాగర్ తీరానికి సచివాలయం, అంబేద్కర్ విగ్రహం సరికొత్త అందాలను అద్దగా తాజాగా అమరుల స్మారక చిహ్నం ఆ అందాలను మరింత పెంచింది. రూ.179 కోట్లు ఖర్చుచేసి స్టెయిన్ స్టీల్ తో ప్రపంచంలోనే అతిపెద్ద స్మారక చిహ్నం నిర్మించింది బిఆర్ఎస్ ప్రభుత్వం. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ అమరవీరుల స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిచనున్నారు.  

అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవం సందర్భంగా స్వరాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసినవారిని ఆర్థిక మంత్రి హరీష్ రావు గుర్తుచేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణత్యాగం చేసిన అమరులకు వినమ్ర శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని మంత్రి అన్నారు. తెలంగాణ ప్రగతిలో ప్రకాశిస్తున్నది మీ త్యాగనిరతి అంటూ అమరుల స్మారక చిహ్నం గురించి కవితాత్మకంగా కామెంట్ చేసారు హరీష్ రావు. 

''అమరుల త్యాగం... అజరామరం, అమరుల స్ఫూర్తి... ప్రజ్వలిత దీప్తి. ఉద్యమ ధ్రువ తారలకు ఘన నివాళి...జై తెలంగాణ'' అంటూ మంత్రి హరీష్ ట్వీట్ చేసారు. అమరువీరుల స్మారక చిహ్నం అందాలకు సంబంధించిన వీడియోను ఈ ట్వీట్ కు జతచేసారు హరీష్ రావు. 

Read More తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నాన్ని ప్రారంభించ‌నున్న సీఎం కేసీఆర్.. ప్ర‌త్యేక‌త‌లివే..

ఇక లుంబినీ పార్కు పక్కనే హుస్సేన్ సాగర్ ఒడ్డున నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నాన్ని నేటి(గురువారం) సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. ఆయన చేతుల మీదు గా ‘తెలంగాణ అమరుల స్మారకం- అమర దీపం’ ప్రజ్వలన కార్యక్రమం జరుగనున్నది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈ కార్యక్రమం జరగనుంది. అమర దీపం స్మారక చిహ్నం తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన తెలంగాణ ప్రజలకు ప్రతీకాత్మక నివాళి. హుస్సేన్ సాగర్ ఒడ్డున సుమారు 3.29 ఎకరాల్లో ఆరు అంతస్తుల భవనాన్ని నిర్మించారు. యావత్ తెలంగాణ సమాజం గర్వించదగ్గ భావనను రేకెత్తించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ భారీ ఉక్కు నిర్మాణాన్ని చేపట్టింది.

1,600 టన్నుల స్టెయిన్లెస్ స్టీల్తో నిర్మించిన ఈ స్మారక కట్టడం దీర్ఘవృత్తాకారంలో మట్టి దీపం రూపంలో 26,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఒకవైపు 26 మీటర్ల ఎత్తు, మరోవైపు 18 మీటర్ల ఎత్తుతో ఉన్న ఈ కట్టడం మొత్తం భూమి మట్టానికి 45 మీటర్ల ఎత్తులో ఉంటుంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios