పోలీసు అభ్యర్థులతో మంత్రి హరీష్ రావు‌ మాట - ముచ్చట

minister harish rao chit chat with police job aspirants
Highlights

సరదా సరదాగా...

 

మెదక్ పోలీసుల ఆధ్వర్యంలో నడిచే పోలీసు ఉద్యోగ పరీక్ష లకు పోటీ పడే అభ్యర్థుల శిక్షణ శిబిరాన్ని మంత్రి హరీష్ రావు సందర్షించారు. మెదక్ లోని డీఎస్పీ కార్యాలయంలో వేయి మంది అభ్యర్థులకు పోలీసు అధికారులచే శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ శిబిరాన్ని సందర్షించిన మంత్రి హరీష్ రావు..వారితో ముచ్చటించారు. ప్రభుత్వం 18 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం చారిత్రాత్మకమన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత ఉపయోగించు కోవాలన్నారు.  మహిళా అభ్యర్థులకు 33 శాతం రిజర్వేషన్లను  సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని...ఇలా రిజర్వేషన్లు అమలు‌చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ యేనన్నారు. మూడు నెలల పాటు కష్టపడితే ఉద్యోగాలు సాధించడం కష్టం కాదన్నారు. ఈ మూడు నెలలు సెల్ ఫోన్లు, సోషల్ మీడియా కు దూరంగా ఉండాలని మంత్రి హరీష్ రావు అభ్యర్థులకు సూచించారు. ఈ శిక్షణ భవిష్యత్ జీవితానికి చక్కటి మార్గమని చెప్పారు.  ఇప్పుడు ఉద్యోగం ఒక వేళ రాకపోయినా...ఈ శిక్షణ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ,సీఆర్పీఎఫ్ , రైల్వే పోలీసు ఉద్యోగాలకు ఉపయోగపడుతుందని చెప్పారు. హైదరాబాద్ కు వెళ్లి శిక్షణ పొందితే 25‌వేల రూపాయల వరకు ఖర్తు అవుతుందని, కాని ఉపసభాపతి చొరవ, జిల్లా ఎస్పీ , పోలీసు ఉన్నతాధికారుల సహకారంతో ఉచితంగా పోలీసు ఉద్యోగాలకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఉపసభాపతి  పద్మా దేవేందర్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా ఎస్పీ చందనా దీప్తి, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

loader