Asianet News TeluguAsianet News Telugu

ఖమ్మం మీ తాత జాగీరా?: మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. తాజాగా ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు.. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Minister Harish Rao Attack On CONGRESS Telangana KRJ
Author
First Published Sep 15, 2023, 2:52 AM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్దం జరుగుతోంది.  ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య విమర్శ, ప్రతి విమర్శలు జరుగుతున్నాయి. తాజాగా ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ను టార్గెట్ చేసుకుంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

కాంగ్రెస్ వాళ్లది మేక పోతు గాంభీర్యమని, ఖమ్మంలో ఒక్క సీటు రానివ్వం అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని, ఖమ్మం కాంగ్రెస్ తాత జాగీరా అని మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలున్నా.. లేకున్నా.. అనునిత్యం ప్రజల కోసం పని చేసే పార్టీ బిఆర్ఎస్ అని అన్నారు. 

ఖమ్మం నగరంలోని పాత కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కళాశాలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి పట్టు బట్టి మెడికల్ కాలేజీ సాధించారని, రూ.25 కోట్లతో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

ఏడాదిలోగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గత పాలకులు వైద్య, అనుబంధ కోర్సులను నిర్లక్ష్యం చేశారని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. అందుకే కేరళ నుండి నర్సులు వచ్చే వారని, ముఖ్యమంత్రి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, ఒక నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి, మంత్రి కోరిక మేరకు ఖమ్మం జిల్లాకు బీఎస్సి పారామెడికల్ కాలేజీ కూడా త్వరలో మంజూరు చేస్తామని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు.


అలాగే.. ఖమ్మం ఆసుపత్రికి త్వరలో ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. గతంలో కంటే ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ కేసులు పెరిగాయనీ,  2014లో ప్రభుత్వ ఆసుపత్రి డెలివరీలు 30శాతం ఉంటే.. ఇప్పుడు 76 శాతంగా ఉన్నాయని, తాము ప్రజలకు కిట్లు ఇస్తే.. కాంగ్రెస్ తిట్లు తిడుతున్నారని మంత్రి దుయ్యబట్టారు.
 
మూడోసారి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనేననీ, ప్రజలంతా సిఎం కెసిఆర్ వెంటే ఉన్నారని దీమా వ్యక్తం చేశారు. సీతారామ ఎంతో ముఖ్యమైన ప్రాజెక్ట్ అని, ఇది పూర్తి అయితే కృష్ణా నదితో సంబంధం లేకుండా రెండు పంటలు పండుతాయని వివరించారు. ఏటా గోదావరిలో నీళ్ళు సముద్రంలో కలుస్తున్నాయని, కృష్ణా నదిలో నీళ్ళు రాకున్నా సమస్య ఉండదని, పనులు నిరాటంకంగా కొనసాగాలంటే సీఎం కేసీఆర్ కు మరోసారి జై కొట్టాలని పిలుపునిచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios