హరీష్ రావు దత్తత గ్రామం చీకోడులో బీజేపీ 22 ఓట్ల ఆధిక్యం సాధించి మంత్రికే షాక్ ఇచ్చింది. ట్రబుల్ షూటర్‌గా, ఉపఎన్నికల కింగ్‌గా పేరున్న మంత్రి హరీష్ రావు దత్తత గ్రామంలో బీజేపీ ఆధిక్యంలో ఉండడం విస్మయం కలిగించింది. 
 
బీజేపీ దుబ్బాక ఎలక్షన్‌ హరీష్‌కు భారీ షాక్ ఇచ్చింది. ఆయన దత్తత గ్రామంలోనూ బీజేపీ సత్తా చాటి హరీష్ ను డైలమాలో పడేసింది. ముఖ్యంగా టీఆర్ఎస్, కాంగ్రెస్‌లోని ముఖ్య నేతలు ప్రాతినిథ్యం వహించిన గ్రామాల్లో సైతం బీజేపీనే పైచేయి సాధించడం ఆశ్చర్యపరుస్తోంది. 

హరీష్ రావు దత్తత గ్రామం చీకోడులో బీజేపీ 22 ఓట్ల ఆధిక్యం సాధించి మంత్రికే షాక్ ఇచ్చింది. ఉదయం నుంచి ఇప్పటి వరకు పూర్తైన ఓట్ల కౌంటింగ్‌లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యంలో ఉన్నారు. 

మధ్యాహ్నం 2 గంటల సమయానికి 14 రౌండ్ల కౌంటింగ్ పూర్తి కాగా.. 13వ రౌండులో టీఆర్ఎస్ ఆధిక్యంలోకి దూసుకొచ్చింది. ఈ రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీకి 304 ఓట్ల ఆధిక్యం లభించింది. టీఆర్ఎస్ 2824, బీజేపీ 2520, కాంగ్రెస్ 1212 ఓట్లు సాధించాయి. 

కాగా.. పదమూడో రౌండ్ ముగిసేసరికి బీజేపీకి 39,265, టీఆర్ఎస్‌కు 35,539, కాంగ్రెస్‌కు 11,874 ఓట్లు పోలయ్యాయి. 13 రౌండ్ పూర్తయ్యేసరికి బీజేపీ 3,726 ఓట్ల లీడ్‌లో ఉంది. ఈ రౌండులో టీఆర్ఎస్ 288 ఓట్ల ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. ఈ రౌండులో బీజేపీ 2249, టీఆర్ఎస్ 2537, కాంగ్రెస్ 784 ఓట్లు దక్కించుకున్నాయి.

ఇక 18వ రౌండు ముగిసేసరికి  688 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ ఉంది. మరో ఐదు రౌండ్లలో విజయం ఎవరిదో తేలిపోనుంది.