ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి షర్మిల.. తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లోటస్  పాండేలో మంగళవారం ఆమె ఆత్మీయ సమావేశం కూడా ఏర్పాటు  చేశారు. కాగా.. ఈ విషయంపై ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. పార్టీ పెట్టడం అంత సులవేమీ కాదని.. తాము స్ట్రాంగ్ గా ఉన్నామని చెప్పారు. కాగా.. కేసీఆర్ తర్వాత ఆ పార్టీ నేతలు కూడా ఒక్కొక్కరుగా ఈ విషయంపై స్పందిస్తుండటం గమనార్హం.

 వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వార్తల నేపథ్యంలో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణలో వేరే పార్టీకి పుట్టగతులు ఉండవని వ్యాఖ్యానించారు. ఇక్కడ టీఆర్ఎస్ తప్ప మరో పార్టీకి అవకాశమే లేదని, వేరే పార్టీలు రావని.. వచ్చినా బతకవని కుండబద్దలు కొట్టారు. ఫ్యాక్షన్ రాజకీయాలు ఇక్కడ నడవవన్నారు. టీఆర్ఎస్‌లో ధిక్కార స్వరమే లేదని, బయట వస్తున్న వార్తలు కరెక్ట్ కాదన్నారు.