మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్‌ను వీడటంపై మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. పార్టీలో ఉన్నన్ని రోజులు బీసీలు, దళితులు గుర్తుకు రాలేదా అని ఆయన ప్రశ్నించారు. ఆస్తుల రక్షణ కోసమే ఈటల బీజేపీలోకి వెళ్తున్నారని గంగుల ఆరోపించారు. హుజురాబాద్‌లో బలంగా వున్నది టీఆర్ఎస్.. ఈటల కాదని మంత్రి స్పష్టం చేశారు. మరోవైపు హుజురాబాద్‌లో ఈటల దళిత బాధితుల సంఘం ఏర్పాటు చేశారు. అక్రమ కేసులు, పీడీ యాక్ట్ కేసుల బారినపడిన 17 కుటుంబాలు సమావేశమయ్యాయి. 

Also Read:ఈ నెల 11 తర్వాత బీజేపీలో చేరనున్న ఈటల: రేపు స్పీకర్ కి రాజీనామా లేఖ

మరోవైపు మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ నెల 11వ తేదీ తర్వాత బీజేపీలో చేరనున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా  పత్రాన్ని స్పీకర్  కు రేపు ఆయన అందించనున్నారు.  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా  సమక్షంలో చేరనున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నకల్లో  హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి ఆయన పోటీ చేసి విజయం సాధించారు. ఈ స్థానం నుండి వరుసగా ఆయన టీఆర్ఎస్ అభ్యర్ధిగా విజయం సాఢించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత  2014, 2018లలో కేసీఆర్ మంత్రివర్గంలో ఈటల రాజేందర్ కు చోటు దక్కింది. భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో రాజేందర్ ను మంత్రివర్గం నుండి కేసీఆర్ భర్తరఫ్ చేశారు.