హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ నెల 11వ తేదీ తర్వాత బీజేపీలో చేరనున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా  పత్రాన్ని స్పీకర్  కు రేపు ఆయన అందించనున్నారు.  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా  సమక్షంలో చేరనున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నకల్లో  హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి ఆయన పోటీ చేసి విజయం సాధించారు. ఈ స్థానం నుండి వరుసగా ఆయన టీఆర్ఎస్ అభ్యర్ధిగా విజయం సాఢించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత  2014, 2018లలో కేసీఆర్ మంత్రివర్గంలో ఈటల రాజేందర్ కు చోటు దక్కింది. భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో రాజేందర్ ను మంత్రివర్గం నుండి కేసీఆర్ భర్తరఫ్ చేశారు. 

also read:ఆత్మగౌరవం కాదు ఆస్తులపై గౌరవం: ఈటలకు టీఆర్ఎస్ కౌంటర్

దీంతో ఈటల రాజేందర్ బీజేపీలో చేరాలని నిర్ణయించుకొన్నారు. ఈ నెల 11వ తేదీ తర్వాత ఈటల రాజేందర్ బీజేపీలో చేరనున్నారు. ఇవాళే టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి తన రాజీనామా పత్రాన్ని ఆయన సమర్పించనున్నారు.  బీజేపీలో చేరిన తర్వాత కేంద్ర హోంమంత్రి  అమిత్ షా ను కూడ ఈటల రాజేందర్ కలిసే అవకాశం ఉంది.అమిత్ షా ప్రస్తుతం అనారోగ్యంగా ఉన్నందున ఎవరికీ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు. అమిత్ షా అపాయింట్ కు అనుగుణంగా  బీజేపీలో  చేరే విధంగా ఈటల రాజేందర్ ప్లాన్ చేసుకొంటున్నారు.