Asianet News TeluguAsianet News Telugu

జోరుగా ధాన్యం కొనుగోళ్లు.. దేశానికే అన్నపూర్ణలా తెలంగాణ : మంత్రి గంగుల కమలాకర్

తెలంగాణ దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణలా మారిందన్నారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. ఈ రోజు ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 
 

minister gangula kamalakar review meeting on paddy procurement
Author
First Published Dec 3, 2022, 4:58 PM IST

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతేడాది కన్నా 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అధికంగా సేకరించినట్లు తెలిపారు. 6734 కొనుగోలు కేంద్రాల ద్వారా 38.06 లక్షల మెట్రిక్ టన్నల ధాన్యం సేకరించినట్లు గంగుల వెల్లడించారు. దేశానికే అన్నపూర్ణలా తెలంగాణ మారిందన్నారు. 

ఇకపోతే.. గత నెల 25న కూడా మంత్రి గంగుల ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. సుమారు 4.16 లక్షల మంది రైతుల నుంచి వరిని కొనుగోలు చేశామని చెప్పిన ఆయ‌న‌.. ఇప్పటికే ఆయా రైతుల ఖాతాల్లోకి రూ.2,154 కోట్లు జమ చేశామన్నారు. "సాధారణంగా, ప్రతి సంవత్సరం నవంబర్, డిసెంబర్‌లలో ఎక్కువ వరి సేకరణ జరుగుతుంది. ఈసారి, సేకరణ సజావుగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఇప్పుడు, రాష్ట్రవ్యాప్తంగా వరి సేకరణ సజావుగా సాగుతోంది' అని మంత్రి కమలాకర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 35 కేందాల్లో కొనుగోళ్లు పూర్తికావడంతో మూసివేసినట్లు కూడా మంత్రి వెల్ల‌డించారు.

Also REad;నకిలీ ఐపీఎస్ శ్రీనివాసరావుకు 14 రోజుల రిమాండ్ .. తీహార్ జైలుకు తరలింపు, వెలుగులోకి మరిన్ని మోసాలు

ధాన్యం కొనుగోలు కేంద్రాలు, అక్క‌డ కల్పించిన సౌక‌ర్యాల గురించి మాట్లాడిన మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్.. కోనుగోలు కేంద్రాల్లో అన్ని ఏర్పాటు చేసిన‌ట్టు తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువస్తే మొత్తం వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు మంత్రిత్వ‌ శాఖ సర్వం సిద్ధం చేయడంతో పాటు అవసరమైన గన్నీ బస్తాలు, టార్పాలిన్ షీట్లు, తేమ శాతాన్ని కొలిచే పనిముట్లు, వరి క్లీనర్లు తదితరాలను అన్ని కొనుగోలు కేంద్రాల్లో అందించిన‌ట్టు తెలిపారు.

ఇదిలావుండగా... మంత్రి గంగుల కమలాకర్,  ఎంపీ వద్దిరాజు రవిచంద్ర(గాయత్రి రవి)‌లు శుక్రవారం సీబీఐ ముందు విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ కేసులో గంగుల కమలాకర్, గాయత్రి రవిలు నోటీసులు అందజేసిన సీబీఐ.. ఈ రోజు విచారణకు రావాల్సిందిగా తెలిపింది. ఈ క్రమంలోనే గంగుల కమలాకర్, గాయత్రి రవిలు ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఇక, సీబీఐ అధికారిగా నటించి ప్రజలను మోసం చేశారనే ఆరోపణలపై  విశాఖపట్నంలోని చిన్న వాల్తేర్‌కు చెందిన శ్రీనివాస్‌ అనే వ్యక్తిని న్యూఢిల్లీలోని తమిళనాడు భవన్‌లో అధికారులు మూడు రోజుల క్రితం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 

అయితే ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కాపు సమ్మేళన సమావేశంలో శ్రీనివాస్.. మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ గాయత్రి రవిలను కలిసినట్టుగా ఉన్న ఫొటోలను సీబీఐ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే వారికి నోటీసులు జారీ చేశారు. దీంతో వారిద్దరు విచారణకు హాజరయ్యారు. వారి వెంట లాయర్లను కూడా తీసుకుని వెళ్లారు. 

ఇక, బుధవారం మంత్రి గంగుల ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారులు.. ఆయన ఇంట్లో లేకపోవడంతో కుటుంబ సభ్యులకు అధికారులు నోటీసులు అందజేశారు. సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద ఈ నోటీసులు అందజేశారు. అయితే తనకు వచ్చిన నోటీసులపై కమలాకర్ స్పందిస్తూ.. సీబీఐ అధికారిగా పరిచయం చేసుకున్న శ్రీనివాస్  గెట్ టుగెదర్‌లో తనను కలిశారని చెప్పారు. తాను సీబీఐ ఎదుట హాజరవుతానని, విచారణకు సహకరిస్తానని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios