గత 30 ఏళ్లుగా తాను, తన బంధువులు గ్రానైట్ వ్యాపారం చేస్తున్నామని ఎప్పుడూ నిబంధనల్ని ఉల్లంఘించలేదన్నారు మంత్రి గంగుల కమలాకర్. తన ఇల్లు, నివాసాలపై ఐటీ, ఈడీలు సోదాలు నిర్వహించడంపై ఆయన స్పందించారు. 

తన ఇల్లు, నివాసాలపై ఐటీ, ఈడీలు సోదాలు నిర్వహించడంపై మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. గత 30 ఏళ్లుగా తాను, తన బంధువులు గ్రానైట్ వ్యాపారం చేస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని గంగుల అన్నారు. తనపై, తన వ్యాపారాలపై ఈడీ, ఐటీకి చాలా మంది ఫిర్యాదులు చేశారని ఆయన ఆరోపించారు. దర్యాప్తు సంస్థలకు సహకరించాలనే తాను దుబాయ్ నుంచి తిరిగివచ్చానని.. ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈడీ, ఐటీ సోదాలు నిర్వహించారని గంగుల ఎద్దేవా చేశారు. 

కాగా.. రాష్ట్రంలోని హైద్రాబాద్, కరీంనగర్ లలో ఈడీ, ఐటీ అధికారులు జాయింట్ ఆపరేషన్స్ నిర్వహించారు. 30 టీమ్ లు పలు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నాయి. మంత్రి గంగుల కమలాకర్ నివాసంతో పాటు పలువురు గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ,ఐటీ అధికారులు బుధవారంనాడు సోదాలు నిర్వహించారు. కమలాకర్ దుబాయ్ టూర్ లో ఉన్నారు. దీంతో ఆయన ఇంటి తలుపులు పగులగొట్టి ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. కరీంనగర్ గ్రానైట్ అక్రమాలపై గతంలోనే సీబీఐ , ఈడీలు కేసు నమోదు చేశాయి.

ALso REad:మంత్రి గంగుల సహా పలువురు గ్రానైట్ వ్యాపారుల ఇళ్లలో ఈడీ సోదాలు:కరీంనగర్,హైద్రాబాద్‌లలో రైడ్స్

ఇవాళ ఉదయం 8 గంటల నుండి అధికారులు సోదాలు చేస్తున్నారు. ఓ రాజకీయ నేత కనుసన్నల్లో గ్రానైట్ తవ్వకాలు చేస్తున్నారని ఫిర్యాదులు అందడంతో ఈ సోదాలు నిర్వహిస్తున్నారని సమాచారం.హైద్రాబాద్ లోని హైదర్ గూడ,సోమాజీగూడ లలో ఈడీ, ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైద్రాబాద్ లోని హైదర్ గూడ,సోమాజీగూడ లలో ఈడీ, ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గ్రానైట్ వ్యాపారులు ఫెమా నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలు రావడంతో సోదాలు చేస్తున్నారని ఈ కథనం తెలిపింది. శ్వేత గ్రానైట్ కంపెనీ డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు సాగుతున్నాయి. గంగుల వెంకన్న, సుధాకర్, బోనాల రాజేశం, పొన్నంనేని గంగాధర్ రావు ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారని తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ తన కథనంలో తెలిపింది.