కరీంనగర్: నిన్నమొన్నటి వరకు అధికార పార్టీ నేతలు ముఖ్యమంత్రిగా కేటీఆర్ సమర్థుడు అతడే సీఎం కావాలంటూ డిమాండ్ చేశారు. తాజాగా ఈ పార్టీ  మంత్రులు కొత్త పల్లవి అందుకుంటున్నారు.  కేటీఆర్ ముఖ్యమంత్రి కావడంతో పాటు  కేసీఆర్ ప్రధాని కావాలన్న డిమాండ్ ను తెరపైకి తెస్తున్నారు.

 మంత్రి గంగుల కమలాకర్ తెలంగాణ భవన్లో మంత్రి కేటిఆర్ సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు.కేసీఆర్ ప్రధాని అయితే దేశం... కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అభివృద్ధి జరగడం ఎంతో సులువున్నారు.

 దాదాపు ఆరు నెలలుగా త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణస్వీకారం చేయబోతున్నాడన్న ప్రచారం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి.

బిజేపితో పొత్తు... కాంగ్రెస్ సీనియర్ల ఆగ్రహం

ఇటీవల మీడియా సమావేశంలో కూడా ముఖ్యమంత్రి కెసిఆర్ జాతీయ రాజకీయాల పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిజెపికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రులు ఏకంచేసి సిఏఏ, ఎన్సిఆర్, ఎన్‌పిఆర్ లాంటి బిల్లులను పూర్తిగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు.

 గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ నినాదంతో ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరిపారు. అది విజయవంతం కాకపోవడంతో ఇప్పుడిప్పుడే జాతీయస్థాయిలో బిజెపికి వ్యతిరేక పవనాలు మొదలు కావడం... ఈసారి జాతీయ రాజకీయాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కువగా దృష్టి సారించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.

గెలిచి ఓడిన రెబెల్స్.. పార్టీలో దక్కని ప్రాధాన్యత

 జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కీలకపాత్ర పోషించినట్లయితే రాష్ట్ర రాజకీయాల్లోకి తనయుడు కేటీఆర్ కు లైన్ క్లియర్ అవుతుందన్న వాదన కూడా వినిపిస్తోంది. కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేసి కెసిఆర్ పూర్తిగా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే అవకాశం ఉందని కూడా పార్టీ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో హాట్ టాపిక్ గా మారాయన్నారు.