ఉపఎన్నిక నేపథ్యంలో హుజురాబాద్ లో టీఆర్ఎస్-బిజెపి ల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. తాజాగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై మంత్రి గంగుల కమలాకర్ విమర్శలు గుప్పించారు. 

హుజురాబాద్: టీఆర్ఎస్ తోనే అభివృద్ది సాధ్యమని... అందుకే ఈ పార్టీలో యువత భారీఎత్తున చేరుతున్నారని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బుధవారం హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఇల్లందకుంటకు చెందిన దాదాపు 100మంది యువకులు టీఆర్ఎస్ లో చేరారు. ఎంపీపీ సరిగొమ్ముల పావని-వెంకటేష్ ఆధ్వర్యంలో మంత్రి గంగుల సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు యువకులు. 

ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ... హుజురాబాద్ లో అబివృద్ది పనులు జోరందుకున్నారు. ఈ అబివృద్దిని చూసే నియోజకవర్గంలోని యువత చూపు టీఆర్ఎస్ పై పడిందన్నారు. నియోజకవర్గం అభివృద్దిలో మేము సైతం భాగస్వాములం అవుతామంటూ గులాబీ బాట పడుతున్నారని మంత్రి అన్నారు. 

''మాజీ మంత్రి ఈటల రాజేందర్ హయాంలో నియోజకవర్గానికి ఓరిగిందేమి లేదు... కేవలం ఆయన మాత్రమే బాగుపడ్డాడు. ఏడేళ్లు మంత్రిగా ఉన్న ఈటల కనీసం నియోజకవర్గ కేంద్రమైన హుజురాబాద్ లో బస్టాండ్ ను కూడా బాగుచేసుకోలేకపోయాడు'' అని గంగుల విమర్శించారు.

read more హుజూరాబాద్ బైపోల్: టీఆర్ఎస్‌కు కాంగ్రెస్ కౌంటర్, దళితబంధుకు చెక్

''అయితే ప్రస్తుతం హుజురాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తాం. ఈ అభివృద్ధి చేసే రాబోయే ఎన్నికల్లో సిఎం కెసిఆర్ సూచించిన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి. అభివృద్ధి నిరంతర ప్రక్రియ... జిల్లా మంత్రిగా తాను హుజురాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నా'' అని గంగుల వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ సునీల్ రావు, సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఎంపీపీ రేణుక తిరుపతి రెడ్డి, జడ్పిటిసి వనమాల సహదేవరెడ్డి సంజీవరెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ,చల్ల హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.