Asianet News TeluguAsianet News Telugu

హుజురాబాద్ ను ఈటెల అస్థవ్యస్థం చేశాడు.. మంత్రిగా ఉండికూడా... గంగుల కమలాకర్

శనివారం హుజురాబాద్లో పలు అభివృద్ధి పనులకు గంగుల కమలాకర్ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో కేంద్ర, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఎన్ని మారినా మున్సిపాలిటీలకు, స్థానిక సంస్థలకు నేరుగా నిధులు ఇవ్వలేదని, ఇళ్లు కట్టుకున్న యాబై ఏళ్ల తర్వాత కూడా మట్టి రోడ్డే ఇంటి ముందు ఉండేదని, సమైక్య పాలనలో అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు.  

minister gangula kamalakar comments on etela rajender in huzurabad
Author
Hyderabad, First Published Sep 18, 2021, 4:27 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో అహర్నిశలు పనిచేస్తున్నామని, పల్లెలు పట్టణాలుగా మారాలని, పల్లెలు, పట్టణాలలు ఆధునికరణ చెంది, అభివ్రుద్ది జరగాలని ఆకాంక్షించారని రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. 

శనివారం హుజురాబాద్లో పలు అభివృద్ధి పనులకు గంగుల కమలాకర్ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో కేంద్ర, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఎన్ని మారినా మున్సిపాలిటీలకు, స్థానిక సంస్థలకు నేరుగా నిధులు ఇవ్వలేదని, ఇళ్లు కట్టుకున్న యాబై ఏళ్ల తర్వాత కూడా మట్టి రోడ్డే ఇంటి ముందు ఉండేదని, సమైక్య పాలనలో అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు.  

స్వరాష్ట్రంగా సిద్దించాక గౌరవ ముఖ్యమంత్రి మున్సిపాలిటీ, స్థానిక సంస్థల నిధులతో సంబందం లేకుండా అభివృద్ది కోసం ప్రభుత్వమే నేరుగా నిధుల్ని అందించాలని సంకల్పించి స్థానిక సంస్థల్ని బలోపేతం చేసారన్నారు. ప్రప్రథమంగా వివిధ రకాలుగా స్పెషల్ డెవలప్మెంట్ నిధుల్ని అందించి రాష్ట్రవ్యాప్తంగా డెవలప్ చేస్తున్నారని గంగుల అన్నారు. 

అన్ని మున్సిపాలిటీలు ఈవిధంగా అభివృద్ధితో దూసుకుపోతుంటే హుజురాబాద్లో ఈటెల నిర్లక్ష్యంతో గతంలో ఉన్న రోడ్లు పూర్తిగా పాడైనా, మున్సిపాలిటీగా మారినా అభివృద్ధి చేయలేదన్నారు, నిధులు రాబట్టలేకపోవడం, ఉన్న నిధుల్ని సైతం సరిగా ఖర్చు పెట్టకపోవడంతో మున్సిపాలిటీలో రోడ్లు అద్వాన్నంగా ఉండేవన్నారు, స్థానిక ఎమ్మెల్యే, మంత్రులే అన్ని డిపార్మెంట్లను సమన్వయం చేసుకొని అభివృద్ధి చేసుకోవాలని. ఏడేళ్లుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి ఈటెల అస్తవ్యస్తంగా హుజురాబాద్ మున్సిపాలిటీని మార్చేశారన్నారు.

ఈ దుస్థితిని గౌరవ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకుపోగానే తక్షణమే స్పందించి 35 కోట్ల రూపాయల్ని కేటాయించారని వీటిలో 25 కోట్ల రూపాయల్ని కేవలం డ్రైన్లు, రోడ్లకే కేటాయించామన్నారు. 140రోడ్లను డెవలప్ చేయడమే కాకుండా మిగతా 100 రోడ్లను ప్రస్థుతం డెవలఫ్ చేయాలని నిర్ణయించి పనులు ప్రారంభించామన్నారు. 10 కోట్లతో పైప్ లైన్ పనులు చేసామన్నారు. మరిన్ని పనులు పెండింగ్లో ఉండడంతో మరోసారి సీఎం కేసీఆర్ మరో 15కోట్లను రిలీజ్ చేశారన్నారు. వీటితో మరో 150 రోడ్లను, బోర్నపల్లి ఇతర అవుట్ స్కర్ట్ రోడ్లను డెవలప్ చేస్తున్నామన్నారు. 

‘కైటెక్స్‌’తో నలభై వేల ఉద్యోగాలు వస్తాయన్న కేటీఆర్.. కైటెక్స్ గ్రూప్, తెలంగాణ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం

750 మీటర్ల దూరం ఉన్న హుజురాబాద్-బోర్నపల్లి రోడ్డు అస్తవ్యస్తంగా ఎక్కడా లేని విధంగా  6నుండి 9మీటర్లతో ఉందని, దీంతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని, వాహాన రాకపోకలకు ఇబ్బందులు ఉంటాయని అసలు వీటిని ఈటెల ఎలా విస్మరించారని దుయ్యబట్టారు గంగుల. ప్రస్థుతం దీని అభివృద్ధికి 6కోట్లతో నిధులు ఇవ్వడమే కాకుండా టెండర్లు పూర్తి చేసి అతి త్వరలోనే ఈ రోడ్డుని పూర్తి చేస్తామన్నారు.

కరీంనగర్లో మాదిరిగా ఇరువైపుల పుట్ పాత్ లతో రోడ్డును ఆధేనికరిస్తామన్నారు మంత్రి గంగుల. మరో నెలరోజుల్లోనే ఈ పనులన్నీ పూర్తయి హుజురాబాద్ అత్యద్భుతంగా డెవలప్ అవుతుందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న డెవలప్ ని.. నిర్లక్ష్యంతో వెనుకబడ్డ హుజురాబాద్లో సైతం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు, మూడునెల్లలోనే ఈ మార్పులకు కారణమైన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి దన్యవాదాలు తెలపారు మంత్రి గంగుల. ఇంతటి అభివృద్ధికి కారణమైన ప్రభుత్వానికి, సిఎం కేసీఆర్ కి అందరూ అండగా ఉండాలని అన్నారు.

ఈ కార్యక్రమాల్లో ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్ బండ శ్రీనివాస్, కరీంనగర్ మేయర్ సునీల్ రావు, హుజురాబాద్ మున్సిపల్ చైర్మన్ గందె రాధిక, వైస్ ఛైర్మన్ కొలిపాక నిర్మలా కుమార్, మున్సిపల్ కౌన్సిలర్లు, కమిషనర్ వెంకన్న,  ఇతర ప్రజాప్రతినిదులు, ఆర్ అండ్ డి ప్రభుత్వ అదికారులు పాల్గొన్నారు. .

Follow Us:
Download App:
  • android
  • ios