హన్మకొండలోని రామ్ నగర్ లో బుధవారం ఓ కాలేజీ యువతిపై ఓ యువకుడు పెట్రోల్ దాడి చేసిన సంగతి తెలసిందే. ప్రేమకు నిరాకరించిందని.. యువతిపై పెట్రోల్ పోసి నిప్పు అటించాడు. కాగా.. యువతికి తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం యువతి ఎంజీఎంలో చికిత్స పొందుతోంది. 

కాగా.. ఈ ఘటనపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. వరంగల్ జిల్లా అధికారులతో మంత్రి ఎర్రబెల్లి ఫోన్ లో మాట్లాడారు. ఇదిలా ఉండగా.. యువతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

యువతిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన ఉన్మాది