Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎన్నికల్లో కన్ప్యూజ్ చేస్తోంది: ఈటల (వీడియో)

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎన్నికల్లోనూ తనను కన్ప్యూజ్ చేస్తోందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రతిసారి హుజురాబాద్ నుండి తనపై ఓ కొత్త వ్యక్తిని పోటీకి దించుతున్నారని తెలిపారు. ఇలా ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెకస్ అభ్యర్థి మారి నియోజకవర్గ ప్రజలను కన్ప్యూజ్ చేస్తున్నారని ఈటల పేర్కొన్నారు. 
 

minister eetela rajender fires on congress party
Author
Huzurabad, First Published Nov 19, 2018, 4:45 PM IST

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎన్నికల్లోనూ తనను కన్ప్యూజ్ చేస్తోందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రతిసారి హుజురాబాద్ నుండి తనపై ఓ కొత్త వ్యక్తిని పోటీకి దించుతున్నారని తెలిపారు. ఇలా ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెకస్ అభ్యర్థి మారి నియోజకవర్గ ప్రజలను కన్ప్యూజ్ చేస్తున్నారని ఈటల పేర్కొన్నారు. 

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం శాలపల్లి రేపు(మంగళవారం) జరగబోయే సిఎం కెసిఆర్ బహిరంగ సభాస్థలిని పరిశీలించిన ఈటల ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ లో 35 ఏళ్ల క్రిందనే చనిపోయిందన్నారు. వారి గుర్తు హస్తంను ప్రజలు భస్మాసుర హస్తంగా భావిస్తున్నట్లు ఈటల పేర్కొన్నారు. ఇక్కడ 1975 నుండి ఒక్కసారికూడా కాంగ్రెస్ గెలవలేదని కానీ ఇండిపెండెంట్ అభ్యర్థులు పలు సందర్భాల్లో గెలిచారని ఈటల గుర్తు చేశారు. 

 కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎన్నికలకు ఒక కొత్త వ్యక్తి హుజురాబాద్ లో బరిలోకి దించచుతుందన్నారు. దీంతో అతడు నెల రోజులు ఇక్కడ తిరిగి ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం తప్ప ఒక్కసారి కూడా గెలవలేరని ఎద్దేవా చేశారు. 

కానీ ఈసారి మరో వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు ఈటల తెలిపారు. తన వద్ద పని చేసే డ్రైవర్లతో, క్లినర్లు, తన ద్వారా పలుకుబడి పొందిన వాళ్ళను కాంగ్రెస్ నాయకులు ప్రలోభాలను గురిచేసి నామినేషన్లు వేయిస్తున్నారన్నారు. ఇలా కుట్రలు పన్ని తమపై అసత్య ఆరోపణలు చేయించి బురద జల్లడం అనేది నీచమైన సంస్కృతి అని ఈటల అన్నారు. సూర్యుని మీద ఎవరు ఉమ్మి వేస్తే తిరిగి అది వారి ముఖం మీదే పడుతుందని...కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు అదే పని చేస్తున్నారని ఈటల మండిపడ్డారు.   

వీడియో

"

Follow Us:
Download App:
  • android
  • ios