విద్యాబుద్దులు నేర్పాల్సిన గురువులే విద్యార్ధినులపై లైంగిక దాడికి పాల్పడి వారిని గర్భవతులను చేశారు. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఆధ్యాత్మిక కేంద్రం ముసుగులో మైనర్ బాలికలపై అఘాయిత్యాలు కలకలం రేపుతున్నాయి.

మతం గురించి చెప్పాల్సిన మతపెద్దే కీచకుడిగా మారి అభం శుభం తెలియిన చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంజు అనే విద్యార్ధినితో పాటు ఆమె సోదరిని గర్భవతులను చేశాడు మదర్సా నిర్వాహకుడి కొడుకు. విషయం బయటకు రావడంతో అబార్షన్ చేయించి చేతులు దులుపుకున్నారు మతపెద్దలు.

మరో యువతి విషయంలో పెళ్లి చేసుకుంటానని అక్కడితో కథ ముగించాడు కీచకుడు. సమాచారం అందుకున్న పోలీసులు మదర్సాకు చేరుకుని నిర్వాహకుడితో పాటు అతని కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం కలిగిస్తోంది.