Asianet News TeluguAsianet News Telugu

అమిత్ షా బీసీ సీఎం హామీపై అసదుద్దీన్ ఒవైసీ స్ట్రాంగ్ కౌంటర్.. ఏమన్నారంటే?

అమిత్ షా బీసీ సీఎం హామీపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీసీలపై అంత సానుభూతి ఉంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు బీసీ జనాభా గణన చేపట్టలేదని నిలదీశారు.
 

mim mp asaduddin owaisi gives strong counter to union minister amit shahs cm cm promise kms
Author
First Published Oct 28, 2023, 7:42 PM IST

హైదరాబాద్: సూర్యపేట జనగర్జన సభలో అమిత్ షా నిన్న సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నేతను ముఖ్యమంత్రి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీ చాలా మందిని ఆకర్షించింది. ఈ కామెంట్ పై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ రియాక్ట్ అయ్యారు. కేంద్రమంత్రి అమిత్ షాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

బీజేపీకి నిజంగా బీసీలంటే అంత ప్రేమ ఉంటే, వెనుకబడిన తరగతులపై అంత సానుభూతి ఉంటే.. కేంద్ర ప్రభుత్వం బీసీ జన గణన ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. పార్లమెంటులో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ, ముస్లిం మహిళలకు సబ్ కోటా ఎందుకు కల్పించలేదని నిలదీశారు. ఇందుకోసం తాను డిమాండ్ చేసినా అటు ప్రధాని మోడీ గానీ, ఇటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మద్దతు ఇవ్వలేదని మండిపడ్డారు. 

Also Read : ఔను.. దర్శన్ హీరానందానికి లాగిన్ ఐడీ ఇచ్చాను ! కానీ, లంచం కోసం కాదు: టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా

జహీరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ఒవైసీ మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ దొందూ దొందేనని అన్నారు. బీజేపీకి, ఎంఐఎంకు రహస్య పొత్తు ఉందని రాహుల్ చేసిన ఆరోపణలను ఖండించారు. అమేథీలో 2019లో రాహుల్ ఎందుకు ఓడిపోయారని? ప్రశ్నించారు. అక్కడ ఎంఐఎం పోటీ చేయలేదు కదా? అని అన్నారు. అదే సందర్భంలో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉంటే ప్రజలకు ప్రాధాన్యత ఉంటుందని వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios