మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలనే ప్రతిపాదనను ఎంఐఎం వ్యతిరేకించింది. మంగళవారం నాడు ఉదయం తెలంగాణ అసెంబ్లీలో పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని కోరుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

హైదరాబాద్: మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలనే ప్రతిపాదనను ఎంఐఎం వ్యతిరేకించింది. మంగళవారం నాడు ఉదయం తెలంగాణ అసెంబ్లీలో పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని కోరుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఈ సమయంలో జరిగిన చర్చకు ఎంఐఎం గైర్హాజరైంది. పీవీకి భారతరత్న ఇవ్వాలన్న తీర్మానాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టుగా ఎంఐఎం తెలిపింది. అంతేకాదు సభ నుండి వాకౌట్ చేసింది. 

also read:పీవీకి భారతరత్న ఇవ్వాలని కోరుతూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం

తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కు ఎంఐఎం మిత్రపక్షంగా ఉంది. టీఆర్ఎస్ తీసుకొన్న పలు కార్యక్రమాలకు ఎంఐఎం మద్దతుగా నిలిచింది. కానీ పీవీ నరసింహారావు విషయంలో ఎంఐఎం తీవ్రంగా వ్యతిరేకించింది.

ఈ తీర్మానం ప్రవేశపెట్టిన సమయంలో పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవలను సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ తీర్మానానికి మద్దతుగా ఇతర పక్షాలు కూడ మద్దతుగా మాట్లాడాయి. ఎంఐఎం మాత్రం ఈ తీర్మానాన్ని వ్యతిరేకించింది.