అతను ఓ యాచకుడు. భార్య, పిల్లలు ఎవరూ లేరు. గుడి దగ్గర అడుక్కుంటూ భక్తులు పెట్టే ప్రసాదాలు తింటూ జీవించేవాడు. అంతేకాకుండా.. గుడికి వచ్చిన వారు ఇచ్చే డబ్బులను పొదుపుగా దాచుకునేవారు. కాగా... సదరు వ్యక్తి సోమవారం గుండెపోటుతో ఆలయ ఆవరణలో మరణించాడు.

కాగా... అతని వద్ద రూ.1.32 లక్షలతోపాటు మరో 9వేలు రద్దయిన కరెన్సీ కూడా లభించాయి. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా లింగంపేట మండలం కోమట్ పల్లిలో సోమవారం చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... గ్రామానికి చెందిన యాచకుడు సాహేబ్ అలీ(60) స్థానికంగా ఉన్న ఆలయంలో భక్తులు నిర్వహించే పండగలకు మేకలు, కోళ్లు కోసేవారు. అక్కడే భోజనం చేసి రాత్రి సమయంలో గ్రామంలో నిద్రించేవారు. సంపాదించిన సొమ్మను ఎవరికీ అనుమానం రాకుండా తన నడుముకి ఓ బెల్టు మాదిరి కట్టుకొని.. దాంట్లోనే దాచుకునేవాడు.

కాగా.. అనూహ్యంగా గుండెపోటుతో మరణించడంతో.. ఆయన దాచుకున్న డబ్బు కూడా బయటపడింది. కాగా.... శవాన్ని అతని సోదరులకు.. ఆ డబ్బుని మత పెద్దలకు అప్పగించారు.