బతుకుదెరువు కోసం కాగజ్ నగర్ ప్రాంతానికి వచ్చి పని చేసుకుంటున్న ఓ కూలి ప్రమాదశాత్తు మరణించాడు. గుంతలో దిగి పని చేస్తున్న క్రమంలో మట్టి పెళ్లలు పడటంతో అక్కడికక్కడే చనిపోయాడు.
అతడో వలస కూలి. ఆయా జిల్లాలో తిరుగుతూ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే రోజు వారిగానే పనికి వెళ్లిన అతడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ప్రతీ మాదిరిగానే కేబుల్ వైర్స్ (cable wires) పనిలో భాగంగా గుంతలోకి దిగాడు. అయితే మట్టి పెళ్లలు అతడిపై పడటంతో మృతి చెందాడు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ (nalgonda) జిల్లా చందుపట్లకు చెందిన లింగయ్య (lingaiah) కూలి. అతడికి 28 సంవత్సరాలు. ఉపాధి కోసం కాగజ్ నగర్ (kagaznagar)ప్రాంతానికి వచ్చి ఉంటున్నారు. ప్రస్తుతం ఓ కంపెనీ కేబుల్ వర్స్ బిగించే పని చేస్తున్నారు. అందులో భాగంగానే కాజగ్ నగర్ మండల పరిధిలోని సర్సా (sarsa)లో పనులు నిర్వహిస్తున్నారు. పనిలో భాగంగా గుంతలోకి దిగాడు. అయితే అదే సమయంలో ఒక్క సారిగా మట్టి పెళ్లలు ఊడి అతడిపై పడ్డాయి. అనుకోకుండా జరిగిన ఈ ఘటనలో లింగయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించారు. అయినా అవేవి ఫలించలేదు. గుంతలో నుంచి లింగయ్యను తీసేందుకు ఓ జేసీబీ వచ్చినప్పటికీ అది కూడా బురదలో కూరుకుపోయింది. దీంతో అక్కడున్న వారంతా నిస్సాహయక స్థితిలోకి వెళ్లిపోయారు.
ఈ ఘటన జరిగిన సమయంలో తండ్రి ఎల్లయ్య (yellaiah) అక్కడే పని చేస్తున్నాడు. మట్టి పెళ్లలు పడిన వెంటనే కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. కానీ అవేవి ఫలితాలను ఇవ్వలేదు. కళ్ల ముందే కుమారుడు మృతి చెందడంతో తండ్రి గుండె పగిలేలా రోదించాడు. ఇది స్థానికులను కంటతడి పెట్టించింది. లింగయ్యకు భార్య సంతోషి (santhoshi), ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లల్లో బన్ని(bunny)కి ఏడేళ్లు కాగా.. నిఖిత (nikitha)కు నాలుగేళ్లు. రోజు కూలి పని చేస్తే గాని రోజు గడవడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటికి అండగా ఉన్న వ్యక్తి మృతి చెందడంతో ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడినట్టైంది. ఎస్సై సందీప్ కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా.. రెండు రోజుల క్రితం ఏపిలోని కృష్ణా (krishna) జిల్లా విసన్నపేట మండలంలో సంబార్ గిన్నెలో పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. కారుమంచి శివ (karumanchi shiva), బన్ను (bannu) దంపతుల కూతురు తేజస్విని (tejashwini) (2). అయితే వారు నివాసం ఉండే కాలనీలో పుట్టిన రోజు వేడుకలు ఉండటంతో ఇద్దరు దంపతులు పాపను తీసుకొని అక్కడికి వెళ్లారు. అయితే భోజనాలు చేసే ప్రదేశంలోని తేజశ్విని కుర్చీలో కూర్చొని ఆడుకుంటోంది. ఈ క్రమంలో ఒక్క సారిగా అక్కడున్న సాంబార్ గిన్నెలో పడిపోయింది. వెంటనే చిన్నారిని తిరువూరు (thiruvuru) లోని ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం విజయవాడ (vijayawada)కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో సోమవారం నాడు చిన్నారి తేజస్విని మృతి చెందింది.
