ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ సిటీ పోలీసులు (hyderabad city police) అవలంభించిన వినూత్న పద్దతి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. (kumari aunty) సోషల్ మీడియా యూజర్లు పోలీసులు చేసిన ట్వీట్ పై మీమ్స్ (memes) చేస్తున్నారు. ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముందంటే ?

మీది మొత్తం 1000 అయ్యింది అనే డైలాగ్ తో ఫేమస్ అయిన స్ట్రీట్ ఫుడ్ సెల్లర్ కుమారి అంటీ ఫేమస్ అయిపోయారు. దీంతో ఆమె రేంజ్ ఒక్క సారిగా పెరిగిపోయింది. ఆమె నడిపే ఫుడ్ బిజినెస్ కూడా లాభాల్లో నడుస్తోంది. అయితే సోషల్ మీడియా చేసే అతి వల్ల కుమారి అంటీ బిజినెస్ క్లోజ్ అయ్యే పరిస్థితి వచ్చింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చొరవతో తిరిగి ఆమె తన వ్యాపారం చేసుకుంటోంది.

ఇదంతా జరిగి చాలా రోజులు అవుతోంది కదా.. మరి ఇప్పుడు ఆమె సంగతి ఎందుకనే కదా మీ డౌట్.. ఆగండి ఆగండి.. అదే చెబుతున్నాం. కుమారి ఆంటీ ఏ డైలాగ్ తో అయితే ఫేమస్ అయ్యిందో ఇప్పుడు అదే డైలాగ్ మళ్లీ ట్రెండ్ లోకి వచ్చింది. ఆ డైలాగ్ ఉపయోగించి హైదరాబాద్ సిటీ పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన ఓ వాహనదారుడికి ఫైన్ వేసిన విషయం మీమ్ రూపంలో తెలియజేశారు. దీంతో ఆ మీమ్ సోషల్ మీడియా యూజర్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. దీంతో అది ఇప్పుడు వైరల్ గా మారింది. 

View post on Instagram
 

హైదరాబాద్ లో ఓ వాహనదారుడు హెల్మెట్ ధరించకుండా, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నాడు. దీనిని ట్రాఫిక్ పోలీసులు ఫొటో తీశారు. హెల్మెట్ ధరించాలని చెబుతూ, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడానికి పోలీసులు కొంత విధానాన్ని అవలంభించారు. ఆ ఫొటోను ‘ఎక్స్’ (ట్విట్టర్) లో పోస్ట్ చేస్తూ ‘‘మీది మొత్తం 1000 అయ్యింది.. యూజర్ ఛార్జీలు ఎక్స్ ట్రా’’ అంటూ క్యాప్షన్ పెట్టారు.

View post on Instagram
 

ఇది సోషల్ మీడియా యూజర్లను విశేషంగా ఆకర్షించింది. హైదరాబాద్ సిటీ పోలీసులు చేసిన ట్వీట్ తో మీమర్స్ మరిన్ని మీమ్స్ తయారు చేశారు. ‘అట్లుంటది మనతోని’ అని కుమారి అంటీ అన్నట్టుగా ఇన్ స్టా గ్రామ్ లో మీమ్స్ వచ్చాయి. 

View post on Instagram
 

‘అబ్బా.. ఏం వాడకం అయ్యా’ అని బ్రహ్మానందం ‘మిర్చీ’ సినిమాలో చెప్పే సీన్ ఫొటోను, పోలీసుల ట్వీట్ ఫొటోను పెట్టి కూడా మీమ్స్ తయారు చేశారు. 

View post on Instagram
 

మరో యూజర్ కూడా ఇలాంటి మీమే ఒకటి తయారు చేశారు. బైక్ ఫొటో, పక్కన కుమారి అంటీ ఫొటో పెట్టి.. ‘మీరు కూడా మా అలాగే తయారు ఏంటీ’ అని మీమర్స్ హైదరాబాద్ సిటీ పోలీసులతో అంటున్న మీమ్ కూడా వైరల్ అవుతోంది. 

View post on Instagram