తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై కేంద్ర హోం శాఖ మరోమారు సమావేశం ఏర్పాటు చేసింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో ఈ నెల 23న ఈ సమావేశం జరగనుంది. 

తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై కేంద్ర హోం శాఖ మరోమారు సమావేశం ఏర్పాటు చేసింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో ఈ నెల 23న ఈ సమావేశం జరగనుంది. ఈ మేరకు ఏపీ, తెలంగాణ అధికారులు కేంద్ర హోం శాఖ సమాచారం పంపింది. ఈ భేటీకి తప్పకుండా హాజరుకావాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిపింది. ఈ సమావేశంలో విభజన సమస్యలపై పూర్తి స్థాయిలో చర్చించాలని కేంద్ర నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. గత సమావేశాల్లో ఇరు రాష్ట్రాల నుంచి వాదనలు వింటూ వస్తున్న కేంద్రం.. ఈ సమావేశంలో కొన్ని సమస్యల పరిష్కారానికి సంబంధించిన నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందనే మాట కూడా వినిపిస్తోంది. 

ఏపీ, తెలంగాణల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి ఇప్పటికే పలుమార్లు సమావేశాలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఈ ఏడాది సెప్టెంబర్ 27న విభజన సమస్యలపై కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో.. 7 ఉమ్మడి అంశాలపై చర్చించారు. ఏపీకి సంబంధించి ఏడు అంశాలపై కేంద్ర అధికారులు చర్చించారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలు, అంశాలు పదేళ్ల లోపు పూర్తి చేయాలని నిబంధన ఉన్న విషయం తెలిసిందే.

అయితే షెడ్యూల్ 10 సంస్థల విభజన, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ విభజన వంటి కీలకమైన అంశాలపై రెండు రాష్ట్రాలు తమ తమ వైఖరులపై గట్టిగానే ఉండటంతో సమస్యల పరిష్కారం దిశగా సాగడం లేదు. అలాగే కొన్ని సంస్థల విభజనకు సంబంధించి రెండు రాష్ట్రాలు దాఖలు చేసిన కోర్టు కేసులు కూడా విభజన సమస్యలు కొలిక్కిరావడం లేదు.